శ్రీ గోవిందరాజ స్వామివారి ఆల‌యంలో మార్చి 26వ తేదీ శుక్ర‌వారం రాత్రి ఒక అనుమానితుడు

Tirupati, 27 March 2021: TTD vigilance and Tirupati urban police are on the lookout for a person who on Friday night tried to unsuccessfully break open the Hundi at Sri Govindaraja Swamy temple and steal its offerings.

As per details of the incident, a suspect who came for darshan at the temple hid himself till the temple closed and tried to open the Hundi with some other master keys.

However when his repeated attempts to open Hundi failed the suspect allegedly left the key set there itself and escaped in the darkness.

On the basis of the CC camera footage all-out efforts are underway by TTD copd and Tirupati Urban Police to identify the culprit and initiate further action on him.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

శ్రీ గోవిందరాజ స్వామివారి ఆల‌యంలో మార్చి 26వ తేదీ శుక్ర‌వారం రాత్రి ఒక అనుమానితుడు

తిరుప‌తి‌, 2021 మార్చి 27:  తిరుప‌తిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆల‌యంలో  మార్చి 26వ తేదీ శుక్ర‌వారం రాత్రి ఒక అనుమానితుడు భక్తులతో పాటు స్వామివారి దర్శనానికి వచ్చి దర్శనం త‌రువాత‌ ఆల‌యంలోని పరకామణి పక్కన దాక్కుని ఉండి పోయాడు.  ఆల‌యం మూసివేసిన తరువాత అక్కడ అందుబాటులో ఉన్న వేరే గది తాళాలతో హుండీ తెరవడానికి ప్రయత్నించగా హుండీ తాళాలు తెరుచుకోక పోవడముతో తాళాలను యధాస్థానములో ఉంచి వెళ్లిపోయాడు.

ఈ సందర్భములో గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో నగదు గాని, వస్తువులు గాని దొంగిలించ‌బడలేదు. సీసీటివి ద్వారా అతని గుర్తించి సత్వరం అతనిపై టిటిడి విజిలెన్స్ మరియు తిరుపతి అర్బన్ పోలీస్ వారు తగు చర్యలు తీసుకుంటున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.