MAHASHANTI TIRUMANJANAM PERFORMED _ శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో మహాశాంతి తిరుమంజనం
Tirupati, 24 May 2023: As part of ongoing Maha Samprokshanam festivities in Sri Govindaraja Swamy temple, Mahas Shanti Tirumanjanam was observed in Tirupati on Wednesday.
Sri Pedda Jeeyar and Sri Chinna Jeeyar Swamijis of Tirumala, chief priest Sri Srinivasa Deekshitulu, DyEO Smt Shanti and others were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో మహాశాంతి తిరుమంజనం
తిరుపతి, 2023 మే 24: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో మహాసంప్రోక్షణలో భాగంగా బుధవారం శాస్త్రోక్తంగా వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఆలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో హోమగుండాలను వెలిగించి పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన, కుంభారాధన, పంచగవ్యారాధన నిర్వహించారు. ఉదయం జలవాసం, బింబస్థాపన చేపట్టారు.
సాయంత్రం మహాశాంతి తిరుమంజనం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఏపి.శ్రీనివాస దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈఓ
శ్రీ రవికుమార్, సూపరింటెండెంట్లు శ్రీ మోహన్ రావు, శ్రీ నారాయణ, టెంపుల్ ఇన్స్పెక్టర్లు
శ్రీ ధనంజయులు, శ్రీ రాధాకృష్ణ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.