FOOL-PROOF ARRANGEMENTS FOR SRI PAT BRHAMOTSAVAMS-TTD JEO _ శ్రీ పద్మావతి అమ్మవారి పంచ‌మితీర్థానికి ప‌టిష్ట ఏర్పాట్లు – టిటిడి జెఈఓ శ్రీ వీరబ్రహ్మం

TRIAL-RUN OF PANCHAMI THEERTHAM SARE HELD

Tirupati, 03 November 2022: Fool-proof arrangements will be made for the ensuing annual Karthika Brahmotsavams of Sri Padmavathi Ammavaru at Tiruchanoor, said TTD JEO Sri Veerabrahmam.

As the mega religious event is all set to be observed between November 20 to 28, the JEO held a trial-run of Panchami Theertham Sare on Thursday followed by a review meeting on arrangements to be carried out for the same in Anna Prasadam Conference Hall at Tholappa Gardens with the officials concerned.

Speaking on the occasion, the JEO said, the route map for Panchami Theertham Sare should be designed properly and ensure hassle-free procession from Tirumala to Tiruchanoor. He directed the concerned to take the help of the district Police for traffic regulation measures on that day. He also instructed the officials concerned to take all necessary measures to see that the elephants does not get panic during the procession. 

The JEO discussed on the entry and exit gates to Padmasarovaram and also reviewed on how to refill the devotees for the second time on the day of Panchami Theertham for Pushkarini Snanam, security arrangements, sheds and barricades to be set up for devotees, Annaprasadam and Water distribution, temporary toilets etc.

TRIAL RUN

The Srivari Panchami Theertham Sare trial-run was held from Vinayaka Swamy temple at Chenna Reddy Colony via Kodanda Rama Swamy temple, Chinna Bazaar Street, Old Huzur Office, Sri Govindaraja Swamy temple, Sri Anjaneya Swamy temple, Bandla Street, RTC Bus Stand, Padmavathi Puram, Market Yard, Silparamam and finally reached Pasupu Mandapam at Tiruchanoor. Later he inspected the ongoing arrangements at Padma Sarovaram.

CVSO Sri Narasimha Kishore, Additonal SP Sri Kula Sekhar, SVBC CEO Sri Shanmukh Kumar, CE Sri Nageswara RAo, SEs Sri Satyanarayana, Sri Venkateswarulu, Gosala Director Dr Harnath Reddy, EEs Sri Manoharam, Sri Narsimhamurthy, Deputy EO Sri Lokanatham, VGO Sri Manohar, Additional Health Officer Dr Sunil Kumar and other officals were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి పంచ‌మితీర్థానికి ప‌టిష్ట ఏర్పాట్లు – టిటిడి జెఈఓ శ్రీ వీరబ్రహ్మం

– శ్రీ‌వారి సారె ట్ర‌య‌ల్ ర‌న్‌

తిరుపతి, 2022 న‌వంబ‌రు 03: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవంబరు 20 నుంచి 28వ తేదీ వరకు జరగనున్నాయ‌ని, చివ‌రిరోజున భ‌క్తులు విశేషంగా విచ్చేసే పంచ‌మి తీర్థానికి ప‌టిష్టంగా ఏర్పాట్లు చేప‌డుతున్నామ‌ని జెఈవో శ్రీ వీరబ్రహ్మం తెలిపారు. తిరుమ‌ల నుండి వ‌చ్చే శ్రీ‌వారి సారె ఊరేగింపు ట్ర‌య‌ల్ ర‌న్ గురువారం నిర్వ‌హించారు. అనంత‌రం తోళ‌ప్ప గార్డెన్స్‌లో గ‌ల అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం స‌మావేశ మందిరంలో పంచమి తీర్థం ఏర్పాట్ల‌పై అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ తిరుమల నుంచి వ‌చ్చే సారె ఊరేగింపు రూట్‌మ్యాప్‌ను ప‌రిశీలించి, ఎలాంటి ఆటంకాలు క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. స్థానిక పోలీసుల స‌హ‌కారం తీసుకుని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా ఈ ఊరేగింపులో ఏనుగులు బెదరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పుష్కరిణిలోకి వెళ్లేందుకు, తిరిగి వెలుపలికి వచ్చేందుకు ఎన్ని గేట్లు ఉన్నాయి, రెండోసారి భ‌క్తులు ప్ర‌వేశించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, పుష్క‌రిణి వ‌ద్ద భ‌ద్ర‌త ఏర్పాట్ల‌పై చ‌ర్చించారు. భ‌క్తులు వేచి ఉండేందుకు షెడ్లు ఏర్పాటు చేయాల‌ని, అక్క‌డ అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు, అద‌నంగా తాత్కాలిక మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేయాల‌ని సూచించారు.

శ్రీ‌వారి సారె ట్ర‌య‌ల్ ర‌న్‌

తిరుప‌తిలోని చెన్నారెడ్డి కాల‌నీలో గ‌ల శ్రీ వినాయ‌క స్వామివారి ఆల‌యం నుండి శ్రీ‌వారి సారె ఊరేగింపు ట్ర‌య‌ల్ ర‌న్ మొద‌లైంది. అక్క‌డి నుండి ఏనుగుపై సారెను ఊరేగింపుగా తీసుకొచ్చారు. ముందుగా శ్రీ కోదండ‌రామాల‌యం, చిన్న‌బ‌జారు వీధి, పాత హుజుర్ ఆఫీస్‌, శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆలయం, శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం, బండ్ల వీధి, ఆర్‌టిసి బ‌స్టాండు, ప‌ద్మావ‌తి పురం, మార్కెట్ యార్డు, శిల్పారామం మీదుగా తిరుచానూరులోని ప‌సుపు మండ‌పం వ‌ద్ద‌కు చేరుకున్నారు. అక్క‌డినుండి శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం వ‌ద్దకు చేరుకుని మాడ వీధుల గుండా పుష్క‌రిణి వ‌ద్ద‌గ‌ల మండ‌పానికి సారెను వేంచేపు చేశారు. పుష్కరిణి వ‌ద్ద పంచమి తీర్థం ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు.

టిటిడి సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, అద‌న‌పు ఎస్పీ శ్రీ కుల‌శేఖ‌ర్‌, ఎస్వీబీసీ సీఈవో శ్రీ ష‌ణ్ముఖ్‌కుమార్‌, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ శ్రీ సత్యనారాయణ, ఎస్ఇ(ఎల‌క్ట్రిక‌ల్) శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు, గోశాల డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌ర‌నాథ‌రెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, అద‌నపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.