SP HRUDAYALAYA IS BETTER THAN CORPORATE HOSPITALS- SUDHA NARAYANA MURTHY OF INFOSYS _ శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ను పరిశీలించిన శ్రీమతి సుధ నారాయణ మూర్తి

SP HRUDAYALAYA IS BETTER THAN CORPORATE HOSPITALS- SUDHA NARAYANA MURTHY OF INFOSYS

HEART TRANSPLANTATIONS SOON- TTD EO

Tirupati, 02 August 2022: Former TTD board member and philanthropist, Smt Sudha Narayana Murthy of Infosys lauded the services and environment at the Sri Padmavati Hrudayalaya are superior to the corporate hospitals in the country.

During her visit to the hospital on Tuesday, she went around the ICU, General wards, Operation Theatres and also interacted with parents who had come from Bangladesh and West Bengal for the treatment of their children.

Smt Narayana Murthy lauded the free services and quality medical procedures performed at the Children’s hospital and appreciated the doctors and para medical staff for their selfless and committed services.

Speaking on the occasion, TTD EO Sri AV Dharma Reddy said over 500 heart procedures have been performed within 6 months span since the inception of the hospital wherein even a few days (six days) old infants were also successfully treated.

He said the SP Hospital is fully geared to undertake heart transplant operations costing ₹20-25 lakhs and TTD is making efforts to procure sophisticated equipments needed.

JEO Sri Veerabrahmam, Hospital Director Dr Srinath Reddy, RMO Dr Bharat participated in the program.

GREATNESS OF INDIA- SAYS SMT NARAYANA MURTHY

Speaking to a Bangladeshi patient from Dhaka, Mohammed Abul Kasan Smt Narayana Murthy said that it was the greatness of India that with the benign blessings of Sri Venkateswara Swamy free medical services are being provided to anyone on humanitarian grounds irrespective of their caste, creed and religion.

Kasan’s five year old daughter Shaheeba, with a hole in the heart has been admitted for the operation. When he was browsing the net he happened to know about this Hospital.

He said he has immediately forwarded his Child’s medical records through e-mail to which the Hospital Director Dr Srinath Reddy responded and asked them to come on July 24 and the operation was performed on July 29 without spending a single paisa.He also complimented the doctors and para medical staff for their dedication in extending the quality services.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ను పరిశీలించిన శ్రీమతి సుధ నారాయణ మూర్తి

– ఆసుపత్రి కార్పొరేట్ కంటే గొప్పగా ఉందని ప్రశంసలు
– త్వరలో గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తాం : ఈవో శ్రీ ధర్మా రెడ్డి

తిరుపతి 2 ఆగస్టు 2022: టీటీడీ నిర్వహణ లోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ను ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకురాలు , టీటీడీ పాలక మండలి మాజీ సభ్యురాలు శ్రీమతి సుధనారాయణమూర్తి మంగళవారం సందర్శించారు .

ఆసుపత్రి లోని ఐసియు , జనరల్ వార్డులు , ఆపరేషన్ థియేటర్లను చూశారు . పిల్లల గుండె ఆపరేషన్ కోసం వచ్చిన బంగ్లాదేశ్ , కోల్ కతా ప్రాంతాలకు చెందిన వారితో ఆమె మాట్లాడారు . ఆసుపత్రి లో రోగులకు ఉచితంగా అందిస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని అభినందించారు . డాక్టర్లు ,సిబ్బంది నిబద్ధతతో వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు . ఆసుపత్రి కార్పొరేట్ స్థాయి కంటే బాగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు . ఆసుపత్రి ప్రారంభించిన ఆరు నెలల్లోనే 500 కు పైగా గుండె ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించామని , వారం రోజుల వయసున్న పిల్లలకు కూడా విజయవంతంగా గుండె ఆపరేషన్లు చేశామని టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి శ్రీమతి సుధ నారాయణ మూర్తికి వివరించారు .త్వరలోనే గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు .

రూ 20 నుంచి 25 లక్షల ఖర్చయ్యే ఆపరేషన్లు ఉచితంగా చేస్తామన్నారు . ఇందుకోసం కొన్ని యంత్రాలు అవసరమవుతాయని వాటిని సమీకరించుకునే ప్రయత్నాల్లో ఉన్నామని శ్రీ ధర్మారెడ్డి వివరించారు . జెఈవో శ్రీ వీరబ్రహ్మం , ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ రెడ్డి , ఆర్ ఎం ఓ డాక్టర్ భరత్ పాల్గొన్నారు .

ఇదీ మా భారత దేశం గొప్పదనం : బంగ్లా దేశ్ వ్యక్తితో శ్రీమతి సుధ నారాయణ మూర్తి

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎక్కడి వారికైనా ఉచితంగా సర్జరీలు చేస్తున్నామని ఇదీ భారత దేశం గొప్పదనమని శ్రీమతి సుధ నారాయణ మూర్తి చెప్పారు . బంగ్లాదేశ్ రాజధాని డాఖా కు చెందిన మహమ్మద్ అబుల్ కసన్ తో ఆమె మాట్లాడారు . ఐదేళ్ల తన కూతురు ఫహీబా కు గుండె లో రంధ్రం ఏర్పడి తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటోందని చెప్పారు . గూగుల్ లో ఉచితంగా గుండె ఆపరేషన్ చేసే చిన్న పిల్లల ఆసుపత్రి కోసం వెదికానని , తిరుపతిలో ఇలాంటి ఆసుపత్రి ఉందని ఇక్కడ వైద్య సేవలు కూడా అద్భుతంగా ఉన్నాయని తెలుసుకుని ఇక్కడకు వచ్చామని శ్రీమతి సుధ నారాయణ మూర్తికి చెప్పారు . మెయిల్ ద్వారా ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ రెడ్డి ని సంప్రదించానన్నారు . పాప మెడికల్ రికార్డులన్నీ ఆయనకు పంపానని ,వాటిని పరిశీలించి ఆపరేషన్ చేస్తామని జూలై 24న ఆసుపత్రికి రావాలని పిలిచారన్నారు . జూలై 24వ తేదీ ఆసుపత్రికి వచ్చి అపాయింట్ మెంట్ తీసుకున్నామని, 29 వ తేదీ రూపాయి ఖర్చు లేకుండా పాపకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేశారని ఆయన వివరించారు . డాక్టర్లు ,సిబ్బంది చాలా మంచి సేవలు అందిస్తున్నారని చెప్పారు .

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది