శ్రీ పుట్టాసుధాకర్ యాదవ్ ఆరోపణలు అర్థ రహితం – టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హిందూ ధార్మిక ప్రచారం
శ్రీ పుట్టాసుధాకర్ యాదవ్ ఆరోపణలు అర్థ రహితం
– టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హిందూ ధార్మిక ప్రచారం
తిరుమల 13 జనవరి 2023: హిందూధర్మం, శాస్త్రాలు తెలియని శ్రీ వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ అయ్యారని టీటీడీ మాజీ చైర్మన్ శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ ఆరోపించడం తీవ్ర అభ్యంతరకరం. శ్రీ సుబ్బారెడ్డి కి హిందూ ధర్మం అన్నా , ధర్మశాస్త్రాలు అన్నా అపారమైన విశ్వాసం ఉంది. ఆయన నేతృత్వంలోని పాలక మండళ్ళ ద్వారా గత నాలుగు సంవత్సరాల కాలంలో దేశ, విదేశాల్లో సైతం టీటీడీ పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. శ్రీ సుబ్బారెడ్డి నేతృత్వంలో దేశ వ్యాప్తంగా గుడికో గోమాత కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన , ఎస్సీ , మత్స్య కార గ్రామాల్లో ఇప్పటికే 500కు పైగా ఆలయాలు నిర్మించడం జరిగింది. మరో 110కి పైగా ఆలయాల నిర్మాణం పూర్తి అయ్యే దశలో ఉన్నాయి. ఇంకా సుమారు వెయ్యి ఆలయాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రపంచ శాంతి, ప్రజల ఆరోగ్యం కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా యజ్ఞ,యాగాదులు నిర్వహించడం జరుగుతోంది. శ్రీవారి వైభవోత్సవాలు ,కళ్యాణోత్సవాలు,యజ్ఞ,యాగాల్లో శ్రీ సుబ్బారెడ్డి స్వయంగా పాల్గొంటున్నారు. సొంత నిధులతో అనేక యజ్ఞ యాగాదులు నిర్వహిస్తున్నారు.ఈ వాస్తవాలు తెలుసుకోకుండా శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ విమర్శలు చేయడం భావ్యం కాదు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది