శ్రీ పోటుతాయరు సన్నిధికి ఈనెల 27వ తేది శుక్రవారం మహాసంప్రోక్షణ

శ్రీ పోటుతాయరు సన్నిధికి ఈనెల 27వ తేది శుక్రవారం మహాసంప్రోక్షణ
 
తిరుపతి, నవంబర్‌-23,2009: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని శ్రీ పోటుతాయరు సన్నిధికి ఈనెల 27వ తేది శుక్రవారం థమి ధనుర్లగ్నము నందు మహాసంప్రోక్షణ అత్యంత భక్తి శ్రద్దలతో జరుగుతుంది.
 
తిరుపతి పట్టణంలో వెలసిన శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో వివిధ ఉప ఆలయాలకు ఈఏడాది ఫిబ్రవరి 27 నుండి మార్చి 1వ తేది వరకు బాలాలయ సంప్రోక్షణం జరిగిన విషయం విధితమే. ఆలయాల మరమత్తుల అనంతరం తిరిగి ఈనెల 27వ తేదిన ఉదయం 9 గంటలకు మహా సంప్రోక్షణ భక్తి శ్రద్దలతో జరుగుతుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.