MAHA PUSHPA YAGAM COMMENCES AT TIRUCHANOOR _ శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో శాస్త్రోక్తంగా క‌న‌కాంబ‌ర స‌హిత కోటి మ‌ల్లెపుష్ప మ‌హాయాగం ప్రారంభం

శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో శాస్త్రోక్తంగా క‌న‌కాంబ‌ర స‌హిత కోటి మ‌ల్లెపుష్ప మ‌హాయాగం ప్రారంభం

తిరుపతి, 2021 జూలై 16: తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో శుక్ర‌వారం ఉద‌యం క‌న‌కాంబ‌ర స‌హిత కోటి మ‌ల్లెపుష్ప మ‌హాయాగం శాస్త్రోక్తంగా ప్రారంభ‌మైంది. ఈ యాగం జూలై 24వ తేదీ వ‌రకు ఆన్‌లైన్ వ‌ర్చువ‌ల్ విధానంలో జ‌రుగ‌నుంది. కోవిడ్‌-19 కార‌ణంగా ప్ర‌పంచ మాన‌వాళికి త‌లెత్తిన ఆర్థిక ఇబ్బందుల‌ను తొల‌గించాల‌ని శ్రీ మ‌హాల‌క్ష్మి అవ‌తార‌మైన శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ప్రార్థిస్తూ టిటిడి ఈ మ‌హాయాగం నిర్వ‌హిస్తోంది.

ఉద‌యం సుప్ర‌భాతంతో అమ్మ‌వారిని మేల్కొలిపి, మూల వ‌ర్ల‌కు అభిషేకం నిర్వ‌హించారు. అనంత‌రం సహస్రనామార్చన, నిత్యార్చన జ‌రిగింది. ఉద‌యం 8.30 గంట‌లకు ఆల‌యంలోని శ్రీ కృష్ణ‌స్వామి ముఖ మండ‌పంలో అమ్మ‌వారిని వేంచేపు చేశారు. ఇందులో భాగంగా సంక‌ల్పం, కుంభ అవాహ‌న‌, అగ్ని ప్ర‌తిష్ట‌, చ‌తుష్టార్చ‌న‌, కోటి కుంకుమార్చ‌న‌లో ఒక ఆవ‌ర్తి,హోమం, ల‌ఘుపూర్ణాహుతి నిర్వ‌హించారు. సాయంత్రం కోటి అర్చ‌న‌, మ‌హా నివేద‌న‌, ల‌ఘు పూర్ణాహుతి నిర్వ‌హించ‌నున్నారు.

టిటిడి పాంచ‌రాత్ర ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ శ్రీ‌నివాసాచార్యులు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ప్ర‌తిరోజూ ఉద‌యం, సాయంత్రం వేళల్లో 400 కిలోల పుష్పాల‌తో అమ్మ‌వారిని అర్చించారు. ఇందులో ఒక్కపూట‌కు 40 కిలోల క‌న‌కాంబ‌రాలు, 120 కిలోల మ‌ల్లెపూలు, 40 కిలోల ఇత‌ర సాంప్ర‌దాయ పుష్పాలు ఉన్నాయి. మొత్తం 180 మంది ఆంధ్ర‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క రాష్ట్రాల నుండి విచ్చేసిన ప్ర‌ముఖ ఋత్వికులు పాల్గొంటున్నారు.

ప్ర‌తిరోజూ ఉద‌యం 10 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు ఈ మ‌హాయాగాన్ని శ్రీ‌వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి క‌స్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ శేష‌గిరి, అల‌య అర్చ‌కులు శ్రీ బాబు స్వామి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

భ‌క్తుల‌కు అందుబాటులో వ‌ర్చువ‌ల్ సేవా టికెట్లు

భ‌క్తులు త‌మ ఇళ్ల నుండి టీవీల ద్వారా వ‌ర్చువ‌ల్ విధానంలో మ‌హాయాగంలో పాల్గొనాల‌నుకునే గృహ‌స్తులు (ఇద్ద‌రు) రూ.1001/- ఆన్‌లైన్‌లో టికెట్ల‌ను పొంద‌వ‌చ్చు. వ‌ర్చువ‌ల్ విధానంలో మ‌హాయాగంలో పాల్గొనే గృహ‌స్తులు 90 రోజుల్లోపు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని రూ.100/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం క్యూలైన్ ద్వారా ఉచితంగా ద‌ర్శించుకోవ‌చ్చు. ద‌ర్శ‌నానంత‌రం గృహ‌స్తుల‌కు ఒక ఉత్త‌రీయం, ఒక ర‌వికె, అమ్మ‌వారి అక్షింత‌లు అంద‌జేస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

180 RITWIKS FROM SOUTHERN STATES TAKE PART IN THE YAGAM

 40O KILOS OF FLOWERS TO BE USED FOR THIS NINE DAY YAGAM

 TIRUPATI, 16 JULY 2021: The unique Kanakambara Sahita Koti Mallepushpa Maha Yagam commenced on a ceremonious note in Sri Padmavathi Ammavari Temple at Tiruchanoor on Friday.

Sri Padmavathi Devi, the presiding deity of the pilgrim centre, believed and worshipped to be the incarnation of the Goddess of Riches, Sri Lakshmi Devi, would be appeased through this distinctive Yagam to overcome the financial crisis the world is facing at present due to Covid pandemic.

About 180 Ritwiks from all the Southern States of India will be doing this Yagakratu for nine days both in the morning and evening sessions under the supervision of Pancharatra Agama Advisor Sri Sreenivasacharyulu of Tiruchanoor temple.

On the first day, after the morning rituals, Sri Padmavathi Devi is seated elegantly on a finely decked platform in Sri Krishna Mukha Mandapam and the flower worship with tens of kilos of Kanakambaram (Crossandra) and Malle (Jasmine) were rendered chanting Vedic hymns. In the morning session, 40 kilos of Crossandra and 120 kilos of Jasmine were offered to the deity while in the evening the Pushpayagam is repeated with the same quantity of flowers.

TTD has already released online tickets to witness this unique Yagam through a virtual platform, which is being live telecasted in SVBC for the sake of global devotees.

Temple DyEO Smt Kasturi Bai, AEO Sri Prabhakar Reddy, Superintendent Sri Seshagiri and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI