Rs19 CRORE SANCTIONED FOR MEDICAL EQUIPMENT AT SRI PADMAVATHI COVID HOSPITAL- TTD EO _ శ్రీ ప‌ద్మావ‌తి కోవిడ్ ఆసుప‌త్రిలో వైద్య ప‌రిక‌రాల కోసం రూ.19 కోట్లు మంజూరు: టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

Tirumala, 5 Apr. 20: TTD Executive Officer Sri Anil Kumar Singhal said on Sunday that in all Rs19 crore has been sanctioned towards the purchase of ventilators and other medical equipment at the Sri Padmavati hospital upon the request of Chittoor District Collector.

He said as per central and state governments directions TTD is extending full cooperation in fighting the Corona virus. He said ₹8 crore already handed over to the district authorities and rest  ₹11 crore will also be handed over soon.

He said besides providing 50,000 food packets daily to support homeless people during lockdown in Tirupati rural and urban areas, TTD has allotted them its rest houses as shelter to these people during the ongoing lockdown period.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ ప‌ద్మావ‌తి కోవిడ్ ఆసుప‌త్రిలో వైద్య ప‌రిక‌రాల కోసం రూ.19 కోట్లు మంజూరు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

ఏప్రిల్ 05, తిరుమల, 2020: క‌రోనా వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆదేశాల మేర‌కు జిల్లా యంత్రాగానికి టిటిడి పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తోంద‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుప‌తిలోని స్విమ్స్ ఆవ‌ర‌ణంలో గ‌ల‌ శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా వైద్య క‌ళాశాల‌లో రాష్ట్ర‌స్థాయి కోవిడ్ ఆసుప‌త్రిని ఏర్పాటుచేశార‌ని, ఇందులో వెంట‌లేట‌ర్లు, ఇత‌ర వైద్య సామ‌గ్రి కొనుగోలుకు, ఇతర వ‌స‌తులు క‌ల్పించేందుకు జిల్లా యంత్రాంగానికి రూ.19 కోట్లు మంజూరుచేశామ‌ని వివ‌రించారు. ఇందులో ఇప్ప‌టికే రూ.8 కోట్లు అంద‌జేశామ‌ని, త్వ‌ర‌లో మిగిలిన రూ.11 కోట్లు అంద‌జేస్తామ‌ని వెల్ల‌డించారు.

తిరుమ‌ల‌లో ఆదివారం ఈవో మీడియాతో మాట్లాడుతూ క‌రోనా స‌హాయ‌క చ‌ర్య‌ల్లో భాగంగా తిరుప‌తిలో ప్ర‌తిరోజూ  మ‌ధ్యాహ్నం, సాయంత్రం క‌లిపి 45 వేల‌ నుండి 50 వేల అన్న‌ప్ర‌సాద పొట్లాలు పంపిణీ చేస్తున్నామ‌ని తెలిపారు. కోవిడ్ స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం తిరుప‌తిలోని విష్ణునివాసం, శ్రీ‌నివాసం, మాధ‌వం విశ్రాంతి గృహాలు, రెండో స‌త్రం, తిరుచానూరులోని ప‌ద్మావ‌తి నిల‌యం భ‌వ‌నాల‌ను జిల్లా యంత్రాంగానికి అప్ప‌గించామ‌ని తెలిపారు. అవ‌స‌ర‌మైతే మ‌రింత స‌హ‌కారం అందించేందుకు టిటిడి సిద్ధంగా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా ఈవో తెలియ‌జేశారు.  శ్రీ‌వారి ఆల‌యంలో కైంక‌ర్యాల‌న్నీ ఏకాంతంగా నిర్వ‌హిస్తున్నామ‌ని, శ్రీ‌వారి ఆల‌యంతోపాటు విజిలెన్స్ అండ్ సెక్యూరిటి, ఆరోగ్య‌, వైద్యం, అన్న‌ప్ర‌సాద విభాగాల అధికారులు విధుల్లో ఉన్నార‌ని, ఇత‌ర విభాగాల అధికారులు ఇంటి వ‌ద్ద నుండే ఈ-ఆఫీస్ ద్వారా పాల‌నా వ్య‌వ‌హారాలు సాగిస్తున్నార‌ని వివ‌రించారు. విధుల్లో ఉన్న టిటిడి అధికారులకు, సిబ్బందికి ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.