TTD EO INSPECTS SRI PADMAVATHI PAEDIATRIC CARDIAC HOSPITAL _ శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌పిల్ల‌ల హృద‌యాల‌యాన్ని ప‌రిశీలించిన ఈవో

Tirupati, 1 Jan. 22: TTD EO Dr KS Jawahar Reddy on Saturday inspected Sri Padmavati Children‘s Cardiac Hospital and made some valuable suggestions.

 

Speaking on the occasion the EO said the hospital was inaugurated by the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy on last year. The hospital has become a backbone for the poor since November 11 onwards as nearly 45 surgeries were performed of which 50% were the open heart and the rest were Cath lab procedures.

 

He said there is a waiting list of over 200 patients and weekly 20 surgeries are being mulled to be performed by a dedicated team of doctors with the aid of sophisticated medical equipment.

 

TTD EO said, as the next expansion in its medical services for the poor, the TTD has commenced an action plan for a super speciality hospital in Tirupati.

 

TTD JEO Sri Veerabrahmam, Chief Engineer Sri Nageswara Rao, CSRMO Sri Sesha Shailendra, Director of Children’s Hospital Dr Srinath Reddy, AEO Sri Parthasarathy were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌పిల్ల‌ల హృద‌యాల‌యాన్ని ప‌రిశీలించిన ఈవో

తిరుమల, 2022 జ‌న‌వ‌రి 01: తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌పిల్ల‌ల హృద‌యాల‌యం ఆసుప‌త్రిని శ‌నివారం టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ చిన్న‌పిల్ల‌ల‌కు పుట్టుక‌తో వ‌చ్చే గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌ను శ‌స్త్రచికిత్స‌ల ద్వారా స‌రిచేసేందుకు 2020, అక్టోబ‌రు 11న ముఖ్య‌మంత్రివ‌ర్యుల చేతులమీదుగా ఈ ఆసుప‌త్రిని ప్రారంభించిన‌ట్టు తెలిపారు. పేద కుటుంబాల వారికి ఈ ఆసుప‌త్రి ఆస‌రాగా నిలుస్తుంద‌న్నారు. న‌వంబరు 11 నుండి 2 నెల‌లుగా శ‌స్త్రచికిత్స‌లు నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు 45 శ‌స్త్రచికిత్స‌లు జ‌రిగాయ‌ని, వీటిలో 50 శాతానికి పైగా ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీలు కాగా మిగ‌తావి క్యాథ్ ల్యాబ్ ద్వారా చేశార‌ని చెప్పారు. శ‌స్త్రచికిత్స‌ల కోసం 200 పైగా వెయిటింగ్ లిస్టు ఉంద‌ని, వారానికి 20 చొప్పున చేసేందుకు ప్ర‌ణాళిక రూపొందించామ‌ని తెలిపారు. ఇక్క‌డి డాక్ట‌ర్లు అంకిత‌భావంతో సేవలు అందిస్తున్నార‌ని చెప్పారు. మ‌రిన్ని వ‌స‌తులు పెంచ‌డంతోపాటు అవ‌స‌ర‌మైన అధునాత‌న ప‌రిక‌రాలు స‌మ‌కూర్చుతామ‌ని తెలిపారు. మ‌రో మెట్టుగా త్వ‌ర‌లో సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి నిర్మాణానికి చ‌ర్య‌లు మొద‌లుపెట్టామ‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, సిఎస్ ఆర్ఎమ్ఓ శ్రీ శేష శైలేంద్ర, చిన్న‌పిల్ల‌ల‌ ఆసుప‌త్రి డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ శ్రీ‌నాథ్‌రెడ్డి, ఏఈవో శ్రీ పార్థ‌సార‌థి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.