TTD DEMANDS UNCONDITIONAL APOLOGY FROM Ex MLA AND CAUTIONS HIM OF DEFAMATION _ శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి బేషరతుగా క్షమాపణ చెప్పాలి
Tirumala, 31 Mar. 21: TTD has strongly condemned the baseless allegations on the TTD board, EO and Additional EO in social media by ex MLA Sri Bandaru Satyanarayana Murthy over the seized hair transportation issue without ascertaining facts.
Expressing strong objections for alleging motives to AP CM Sri YS Jaganmohan Reddy though he has no links to the hair issue.
TTD said that on Tuesday it had categorically ruled out any role in the spoiled hair caught by Mizoram police and again Additional EO Sri A V Dharma Reddy had clarified issues at a media conference last evening. Again on Wednesday morning, the Additional EO had released documents presented by Customs, Mizoram police and Assam Rifles proving that TTD had nowhere figured in those reports.
TTD said that it had since decades been auctioning processed hair and temples in India accounted for only 25% of hair that is traded in the country.
TTD cautioned the ex MLA that he should not throw mud on the TTD board and officials without ascertaining true facts of the case.
TTD also cautioned that such baseless allegations with political motives would play dangerously on the sentiments of devotees.
Hence TTD appealed once again that former MLA Sri Bandaru Satyanarayana Murthy should realise his folly and offer an unconditional apology or face legal action which included civil and criminal defamation notices by TTD.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి బేషరతుగా క్షమాపణ చెప్పాలి
–. లేదంటే చట్టప్రకారం సివిల్ మరియు క్రిమినల్ డిఫమేషన్ కేసులు పెట్టడం జరుగుతుంది
తిరుమల, 2021 మార్చి 31: తలనీలాల రవాణాకు సంబంధించి వాస్తవాలు తెలుసుకోకుండా మాజీ ఎమ్మెల్యే శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి టిటిడి ధర్మకర్తల మండలి, ఈవో, అదనపు ఈవోలపై ఆరోపణలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడంపై టీటీడీ తీవ్ర అభ్యంతరం తెలియజేస్తోంది.
ఈ విషయంలో ఏమాత్రం సంబంధం లేని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై నిరాధారమైన ఆరోపణలు చేయడం పై టీటీడీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
మిజోరం రాష్ట్రంలో పట్టుబడిన తలనీలాలు టిటిడికి సంబంధించినవి కావని మంగళవారం ఉదయం ప్రకటన విడుదల చేశాము. నిన్న సాయంత్రం అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి మీడియాసమావేశం పెట్టి వాస్తవాలు వెల్లడించారు.
బుధవారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కస్టమ్స్, అస్సాం రైఫిల్స్ అధికారులు పోలీసులకు ఇచ్చిన నివేదికను మీడియాకు అందజేయడం జరిగింది. అందులో ఎక్కడా టిటిడి పేరు లేని విషయాన్ని, పట్టుబడ్డ తలనీలాలు మిజోరంలో స్థానికంగా సేకరించారనే విషయాలను బయట పెట్టాము.
టిటిడిలో ప్రస్తుతం ఉన్న తలనీలాల ప్రాసెసింగ్ విధానం కొత్తగా ఏర్పాటు చేసింది కాదు. కొన్ని దశాబ్దాల నుంచి ఈ విధానం ఉంది. ఈ విధంగా ప్రాసెస్ చేసిన తలనీలాలను వివిధ గ్రేడ్లుగా విభజించి వేలం వేయడం అనే ప్రక్రియ ఎన్నో ఏళ్లుగా జరుగుతోంది.
మిజోరం-మయన్మార్ సరిహద్దుల్లో పట్టుబడింది ప్రాసెస్ చేయని తలనీలాలు. దేశంలో సేకరిస్తున్న తలనీలాల్లో ఆలయాల నుండి వస్తున్నది కేవలం 25 శాతం మాత్రమేనన్న విషయం గుర్తుంచుకోవాలి.
ఈ వాస్తవాలేవీ తెలుసుకోకుండానే మాజీ ఎమ్మెల్యే శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి టిటిడి ధర్మకర్తల మండలిపై, అధికారులపై నిందారోపణలు చేస్తూ బురద చల్లడం మంచిది కాదని హెచ్చరిస్తున్నాము.
టీటీడీ విషయంలో రాజకీయ దురుద్దేశాలతో అవాస్తవ ఆరోపణలు చేసి భక్తుల విశ్వాసం తో ఆడుకోవద్దని హితవు చెబుతున్నాము.
ఈ విషయం పై శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుని బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. లేనిపక్షంలో చట్టప్రకారం వారిపై సివిల్ మరియు క్రిమినల్ డిఫమేషన్ నోటీసులు పంపడం జరుగుతుందని హెచ్చరిస్తున్నాం.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.