COMPLETE VAKULAMATA TEMPLE WORKS ON WAR FOOTING- TTD EO _ శ్రీ వకుళ మాత ఆలయ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి – టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి
DIRECTED OFFICIALS TO COORDINATE WITH DISTRICT ADMINISTRATION
Tirupati, 13 June 2022: TTD EO Sri AV Dharma Reddy directed officials to complete all the development works at Sri Vakulamata temple coming up near Perur on a war-footing.
Addressing a review meeting with officials on Monday evening at Sri Padmavati Rest House in Tirupati, the EO said all efforts be done in coordination with the district administration giving no room for any lapses as AP Chief Minister Sri YS Jaganmohan Reddy is scheduled to participate in the temple Maha Samprokshanam fete on June 23.
Among others, he instructed officials to organise public address systems, German sheds to beat hot summer, fans, tight security, CC Cameras, depute adequate Srivari Sevakulu, arrange flower decorations, illuminations etc.
He also discussed on Anna Prasadam, transportation, suggested on invitation cards, live telecast by SVBC and instructed every one to ensure grand success of the event in coordination with district administration.
TTD JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CE Sri Nageswara Rao, SVBC CEO Sri Suresh Kumar and VGO Sri Manohar were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ వకుళ మాత ఆలయ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి
– జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోండి
టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి
తిరుపతి 13 జూన్ 2022: పేరూరు సమీపంలోని శ్రీ వకుళమాత ఆలయ పునర్నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.
తిరుపతి లోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో సోమవారం సాయంత్రం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ ధర్మారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో చిన్న పొరబాటుకు కూడా అవకాశం ఇవ్వరాదని చెప్పారు. ఆలయానికి సంబంధించిన ఫ్లెక్సీలు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం (మైక్ సెట్), ప్రజలు ఎండ వేడిమితో ఇబ్బంది పడకుండా జర్మన్ షెడ్లు వేసి అవసరమైనన్ని ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. భద్రత ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని, సిసి టివి లు ఏర్పాటు చేయాలన్నారు. శ్రీవారి సేవకులు, అవసరమైనంత మంది సిబ్బందిని డిప్యూట్ చేసి గుర్తింపు కార్డులు జారీ చేయాలని ఈవో అధికారులకు సూచించారు. అన్నప్రసాదాల తయారీ , రవాణా ఏర్పాట్ల పై అధికారులతో చర్చించారు. కార్యక్రమం విజయవంతం చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం తో సమన్వయం చేసుకోవాలన్నారు. ఆలయాన్ని పుష్పాలతో అందంగా అలంకరించాలన్నారు. ఆహ్వాన పత్రికల ముద్రణపై శ్రీ ధర్మారెడ్డి అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఎస్వీబీసీ సీఈవో ను ఆదేశించారు.
జెఈవో లు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్వీబీసీ సీఈవో శ్రీ సురేష్ కుమార్, విజివో శ్రీ మనోహర్ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది