PHOTO EXPO AND PANCHAGAVYA STALL ATTRACTS DEVOTEES _ శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల్లో ఫొటో ఎగ్జిబిషన్, పంచగవ్య ఉత్పత్తుల స్టాల్
HYDERABAD, 11 OCTOBER 2022: The exhibition with flexes about the various charitable and development activities by TTD and the sale of the Panchagavya Products stall are a special attraction to devotees in NTR Stadium at Hyderabad.
As a part of the ongoing Sri Venkateswara Vaibhavotsavams in Hyderabad, the Public Relations Wing of TTD has displayed a photo exhibition which included the flexes on recent initiatives by TTD viz. Go Mahatyam, Gopuja, Saptagiri Gopradakshinashala, Indigenous breeds of Cows, Go Adharita Vyavasayam, Srivariki Go Adharita Naivedyam, Navaneeta Seva, an increase of pilgrim devotees to Tirumala in the last seven decades, Srivari Seva, e-cars, Pavitra Udyanavanams, Agarbattis, Dry Flower Technology images and products, Panchagavya products etc.
TTD has commenced a pack of 15 Panchagavya products under the brand name “Namami Govinda” which has also been made available for sales for the sake of devotees apart from various books published by TTD.
Srivari Sevaks have also been pressed into service to distribute Annaprasadam and water to the visiting devotees.
శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల్లో ఫొటో ఎగ్జిబిషన్, పంచగవ్య ఉత్పత్తుల స్టాల్
– భక్తుల కోసం శ్రీవారి లడ్డూల విక్రయం
హైదరాబాద్, 2022 అక్టోబరు 11: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో మంగళవారం ప్రారంభమైన శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల్లో టిటిడి ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో ఫ్లెక్సీలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్, సేల్స్ వింగ్ ఆధ్వర్యంలో పబ్లికేషన్ స్టాల్, పంచగవ్య ఉత్పత్తుల స్టాల్ ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి తిరుమల శ్రీవారి లడ్డూలు అందుబాటులో ఉంచారు. భక్తులు ఒక్కొక్కటి రూ.50/- చొప్పున కొనుగోలు చేయవచ్చు.
ఫొటో ఎగ్జిబిషన్లో గోవు మహత్యం, గోపూజ విశిష్టత, సప్తగోప్రదక్షిణశాల, గోసంరక్షణశాలలో దేశవాళీ ఆవుల పెంపకం, గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులతో శ్రీవారికి నైవేద్యం, గత ఐదు దశాబ్దాల్లో శ్రీవారి దర్శనానికి పెరుగుతున్న భక్తుల సంఖ్య, శ్రీవారి సేవ, నవనీత సేవ, విద్యుత్ కార్లు, లడ్డూ ప్రసాదం, పవిత్ర ఉద్యానవనాలు, అగరబత్తుల తయారీ, పంచగవ్య ఉత్పత్తుల తయారీ, శ్రీవారి పుష్ప ప్రసాదం ఫొటో ఫ్రేమ్స్ తదితరాల ఫ్లెక్సీలు ఉన్నాయి. భక్తులు వీటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు.
అదేవిధంగా, శ్రీవారి వైభవాన్ని తెలిపేలా ముద్రించిన ఆధ్యాత్మిక పుస్తకాలను టిటిడి పుస్తక విక్రయశాలలో అందుబాటులో ఉంచారు. ‘నమామి గోవింద’ పేరుతో విడుదల చేసిన పంచగవ్య ఉత్పత్తులు, డ్రైఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన ఫొటో ఫ్రేమ్స్ భక్తులకు విక్రయించేందుకు అందుబాటులో ఉంచారు.
వైభవోత్సవాలు తిలకించడానికి వచ్చే భక్తులకు శ్రీవారి సేవకులతో తాగునీరు, స్వామివారి ప్రసాదాలు అందిస్తున్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.