EXTENSIVE ARRANGEMENTS FOR SRI VENKATESWARA VAIBHAVOTSAVAMS AT NELLORE-TTD EO _ శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు : టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
Tirupati,14 July 2022:TTD EO Sri AV Dharma Reddy has directed officials to make extensive arrangements for Five-day Sri Venkateswara Vaibhavotsavam at Nellore slated from August 16-20.
Addressing a review meeting at the TTD administrative building conference hall on Thursday, the TTD EO said the Vaibhavotsavam fete was organized in other regions to provide devotees a real experience of daily kainkaryams performed at Tirumala Srivari temple.
He instructed the engineering officials to install a platform with decorative top, galleries, queue lines, Prasadam counters, temporary toilets, kitchen, sign boards, etc.
He asked them to make arrangements for attractive flowers and electrical decorations, special lighting, LED screen display, public address systems, cc cameras, a vigilance control room, a photo exhibition on the latest TTD programs, and to depute Srivari Sevakulu.
He urged officials of all TTD departments to coordinate their activities and ensure the grand success of the five festivities in Nellore town.
TTD JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, SVBC CEO Sri Shanmukha Kumar, CE Sri Nageswar Rao, and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు : టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుపతి, 2022 జులై 14: నెల్లూరులో ఆగస్టు 16 నుండి 20వ తేదీ వరకు 5 రోజుల పాటు శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తామని, ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో గురువారం వైభవోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారు కొలువైన తిరుమల ఆలయంలో రోజువారీ నిర్వహించే సేవలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా పలు ప్రాంతాల్లో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంజినీరింగ్ అధికారులు వైభవోత్సవాల నిర్వహణకు ఆకట్టుకునేలా పైకప్పుతో కూడిన వేదిక, భక్తులు కూర్చునేందుకు గ్యాలరీలు, క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్లు, లడ్డూ విక్రయ కౌంటర్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, పోటు, సైన్‌బోర్డులు తదితర ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, ప్రత్యేక లైటింగ్, ఎల్ఇడి డిస్‌ప్లే స్క్రీన్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రతాపరంగా ఇబ్బందులు లేకుండా సిసి కెమెరాలు, కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేయాలని సివిఎస్వోను కోరారు. టిటిడిలో ఇటీవల చేపట్టిన కార్యక్రమాలపై ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు సేవలందించేందుకు శ్రీవారి సేవకులను ఆహ్వానించాలని కోరారు. ఈ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు.
ఈ సమీక్షలో జెఈఓలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖకుమార్, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.