EO RELEASES PANCHANGAM _ శ్రీ శోభకృత్ నామ సంవత్సర పంచాంగం విడుదల
TIRUPATI, 07 MARCH 2023: In connection with Sobhakrit Ugadi on March 22, TTD EO Sri AV Dharma Reddy released the Panchangam on Tuesday along with JEOs Smt Sada Bhargavi and Veerabrahmam at his chambers in TTD Administrative Building in Tirupati.
FACAO Sri Balaji, PRO Dr T Ravi were also present.
శ్రీ శోభకృత్ నామ సంవత్సర పంచాంగం విడుదల
తిరుపతి 7 మార్చి 2023: టీటీడీ ముద్రించిన శ్రీ శోభకృత్ నామ సంవత్సర పంచాంగాన్ని ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి మంగళవారం తన కార్యాలయంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఈవో శ్రీ ధర్మారెడ్డి మాట్లాడుతూ,ప్రతి ఏటా లాగానే రాబోయే నూతన తెలుగు సంవత్సరాది శోభకృత్ నామ సంవత్సర పంచాగం ముద్రించినట్లు చెప్పారు. బుధవారం నుంచితిరుమలలో రూ.75 చెల్లించి భక్తులు వీటిని కొనుగోలు చేయవచ్చని అన్నారు. మిగిలిన ప్రాంతాల్లో మార్చి రెండో వారం నుంచి అందుబాటులో ఉంచుతామని అన్నారు.
జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీర బ్రహ్మం, ఎఫ్ఎ సిఏవో శ్రీ బాలాజి,పిఆర్వో డాక్టర్ రవి, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి శ్రీ రామరాజు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది