SRI SUBRAMANYA SHASTRI WORTH HUNDREDS OF CRORES- BUMANA KARUNAKARA REDDY _ శ్రీ సాధు సుబ్రమణ్య శాస్త్రి వంద కోట్ల హిందువుల ఆస్తి- 133వ జయంతి సభలో శాసన సభ్యులు శ్రీ భూమన కరుణాకర రెడ్డి

PARTICIPATES IN 133th JAYANTI FESTIVITIES

Tirupati,17 December 2022: Sri Sadhu Subramanya Shastri has empowered the world with the glory of lord Venkateswara and an asset with hundreds of crores of Hindus spread across the globe said Tirupati MLA Sri Bhumana Karunakar Reddy.

Participating as chief guest in the 133rd Jayanti celebrations of eminent epigraphist of Tirumala, Sri Sadhu Subramanya Shastri at SVETA in Tirupati on Saturday he recalled the contributions of Sri Shastri.

Earlier all dignitaries garlanded the life-size bronze statue of Sri Sadhu Subramanya Shastri in front of SVETA Bhavan.

Tirupati MLA said that it was his findings in the inscriptions in Srivari temple that Sri Bhoga Srinivasa murthy idol was donated by Pallava Queen Samavai.

Though a small-time employee of TTD he had brought out thousands of inscriptions in Tirumala. “It was my good fortune that I was acquainted with such a great personality during school days, said Karunakar Reddy.

He said when he was the TTD Chairman with the blessings of Sri Venkateswara Swamy that he had undertaken the installations of the statues of eminent persons like Sri Sadhu Subramanya Shastri, Sri Veturi Prabhakar Shastri, Sri Rallapalli Anantakrishna  Sharma in the pilgrim city to motivate people to take lessons from their life stories.

He said every devotee of Sri Venkateswara should read the compilation of inscriptions by Sri Subramanya Shastri.

Among others, TTD board member Sri P Ashok, daughter of Sri Shastri; Smt Girija, grand son and Kadapa additional district sessions judge  Sri CS Murthy, SVETA Director Prashanti, Epigraphist Sri Krishna Reddy, TTD CAuO Sri Sesha Shailendra, DEO Sri Bhaskar Reddy, Retd director general of Doordarshan Sri Ananta Padmanabha Rao, Prof.Chandramouli of Puducherry University, SV Museum OSD Sri Krishna Reddy, SV oriental college Prof.Sri Venkateshwarlu were present.

On the occasion of the Shastri Jayanti celebrations, TTD published the book Saraswata Samvikshanam was unveiled by Sri Karunakar Reddy.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ సాధు సుబ్రమణ్య శాస్త్రి వంద కోట్ల హిందువుల ఆస్తి– 133వ జయంతి సభలో శాసన సభ్యులు శ్రీ భూమన కరుణాకర రెడ్డి

తిరుపతి 17 డిసెంబరు 2022: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం చరిత్రను ప్రపంచానికి తెలియజేసిన శ్రీమాన్ సాధు సుబ్రమణ్య శాస్తి దేశంలోని వంద కోట్ల హిందువుల ఆస్తి అని శాసన సభ్యులు శ్రీ భూమన కరుణా కర రెడ్డి అన్నారు.
శ్రీమాన్ సాధు సుబ్రమణ్య శాస్త్రి 133వ జయంతి సందర్భంగా శనివారం శ్వేత సమావేశం మందిరంలో జరిగిన జయంతి సభకు శ్రీ కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీవారి ఆలయ చరిత్ర వెలికి తీసిన శ్రీ సుబ్రమణ్య శాస్త్రి స్వామివారి కి అనన్య సేవ చేశారన్నారు. రాణి సామవై భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని ఆలయానికి అందించారని శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి వెలికి తీసిన తొలి శాసనమే శ్రీవారి ఆలయ చరిత్ర బయటకు రావడానికి కారణమన్నారు. టీటీడీలో చిన్న స్థాయి అధికారిగా ఉంటూ వెయ్యి కి పైగా శాసనాలను వెలికితీసి పరిష్కరించిన గొప్ప వ్యక్తి ఆయన అని చెప్పారు. అలాంటి మహానుభావునితో తనకు పాఠశాల చదివే రోజుల్లోనే పరిచయం కావడం తన అదృష్టమని శ్రీ కరుణాకర రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అమూల్యమైన సేవలందించిన శ్రీ సాధు సుబ్రమణ్య శాస్త్రి, శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి, శ్రీ రాళ్ళ పల్లి ఆనంతకృష్ణ శర్మ విగ్రహాలు ప్రతిష్టించాలనే ఆలోచన శ్రీ వేంకటేశ్వర స్వామి వారే తనకు కల్పించారన్నారు. ఇలాంటి మహానుభావుల జీవితాల మీద చర్చ జరగాలని, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. శ్రీ సాధు సుబ్రమణ్య శాస్త్రి వెలికి తీసి పరిష్కరించిన శాసనాల పుస్తకాలను ప్రతి ఒక్కరు చదవాలన్నారు. టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్ మాట్లాడుతూ, శ్రీ సాధు సుబ్రమణ్య శాస్త్రి తన జీవితాన్ని స్వామి సేవకు అంకితం చేసిన మహా మనిషి అన్నారు. ఇలాంటి వారి సేవలను టీటీడీ గుర్తు చేసుకోవడం సంతోషమన్నారు. శ్రీ సాధు సుబ్రమణ్య శాస్త్రి కూతురు శ్రీమతి గిరిజ, మనుమడు, కడప అదనపు జిల్లా సెషన్స్ జడ్జి శ్రీ సి ఎస్ మూర్తి మాట్లాడుతూ, శ్రీ భూమన కరుణాకర రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో శ్రీ సాధు సుబ్రమణ్య శాస్త్రి విగ్రహం ప్రతిష్టించడం సంతోషమన్నారు.

శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో శాసన పరిశోధకులు శ్రీ కృష్ణారెడ్డి, టీటీడీ సిఏవో శ్రీ శేషశైలేంద్ర, డిఈవో శ్రీ భాస్కర రెడ్డి, దూరదర్శన్ విశ్రాంత అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీ అనంత పద్మనాభరావు, పుదుచ్చేరి యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ చంద్ర మౌళి, ఎస్వీ మ్యూజియం ప్రత్యేకాధికారి శ్రీ కృష్ణారెడ్డి, ఎస్వీ ఓరియంటల్ కళాశాల ఆచార్యులు శ్రీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

పుస్తకావిష్కరణ

శ్రీ సాధు సుబ్రమణ్య శాస్త్రి జయంతి సందర్బంగా టీటీడీ ముద్రించిన సారస్వత సంవీక్షణం పుస్తకాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కరుణాకర రెడ్డి ఆవిష్కరించారు.
అంతకుముందు శ్వేత భవనం ఎదురుగాగల శ్రీమాన్ సాధు సుబ్రమణ్య శాస్త్రి విగ్రహానికి అథితులందరూ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

టీటీడీ ప్రజా సంబంధాల ఆధికారిచే జారీ చేయడమైనది