12th SUCCESSFUL HEART TRANSPLANT AT SRI PADMAVATI CHILDREN’s HRUDAYALAYAM _ శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో విజయవంతంగా 12వ గుండె మార్పిడి
– TRANSPORTED FROM SRIKAKULAM TO VIZAG THROUGH GREEN CHANNEL
TTD EO SRI AV DHARMA REDDY APPRECIATES DOCTORS TEAM
Tirupati, 27 February 2024: The doctors of Sri Padmavathi Children’s Heart Care Hospital had successfully conducted the 12th heart transplant surgery on Tuesday.
TTD EO Sri AV Dharma Reddy congratulated the medical team under the direction of the hospital Director Dr. Srinath Reddy who completed this heart transplant surgery.
K. Dharmarao (28) of Rajolu, Srikakulam district was seriously injured in a road accident and was admitted to GEMS Hospital there.
However, doctors diagnosed the young man as brain dead. The parents agreed to donate the young man’s organs and informed other hospitals.
Meanwhile, a 42-year-old man from Vizag was undergoing treatment at Sri Padmavathi Children’s Heart Hospital in Tirupati, suffering from heart attack due to dilated cardiomyopathy.
After receiving the information about the transplant, Dr. Srinath Reddy, the Director of Sri Padmavathi Heart Hospital, immediately contacted the higher authorities and made arrangements for the heart transplant.
On February 26 at 6 pm, the medical team collected the heart and left for Vizag by road from Rajolu via Green Channel with special arrangements and took a special flight from Vizag at 8 pm and reached Renigunta airport at 10.05 pm and in 20minutes reached Sri Padmavati Children’s Hospital at 10.25 pm.
The heart transplant surgery was completed on Tuesday at 4am in a successful manner, adding one more feather in the victory cap of the Hospital.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో విజయవంతంగా 12వ గుండె మార్పిడి
– శ్రీకాకుళం నుండి గ్రీన్ ఛానల్ ద్వారా వైజాగ్‌కు తరలింపు
– అక్కడి నుండి ప్రత్యేక విమానంలో తిరుపతికి గుండె తరలింపు
– 42 ఏళ్ల వ్యక్తికి గుండెను అమర్చిన వైద్య బృందం
– డాక్టర్లను అభినందించిన టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి
తిరుపతి, 27 ఫిబ్రవరి 2024: శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం( చిన్నపిల్లల గుండె ఆసుపత్రి) వైద్యులు 12వ గుండె మార్పిడి శస్త్ర చికిత్సను మంగళవారం విజయవంతంగా నిర్వహించారు. ఈ గుండెమార్పిడి శస్త్రచికిత్సను పూర్తిచేసిన ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథరెడ్డి ఆధ్వర్యంలోని వైద్యబృందాన్ని టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి అభినందించారు.
శ్రీకాకుళం జిల్లా రాజోలుకు చెందిన కె.ధర్మారావు(28) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో అక్కడి జెమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, ఆ యువకుడికి బ్రెయిన్ డెడ్‌గా వైద్యులు గుర్తించారు. సదరు యువకుడి అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు అంగీకరించడంతో ఇతర ఆసుపత్రులకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా వైజాగ్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తి డైలేటెట్ కార్డియోమయోపతి వ్యాధితో గుండె పోటుకు గురయ్యే స్థితిలో తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో చికిత్స పొందుతున్నాడు. అవయవదానం సమాచారం అందుకున్న శ్రీ పద్మావతి హృదయాలయం డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథరెడ్డి వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించి గుండె మార్పిడికి ఏర్పాట్లు చేశారు.
ఫిబ్రవరి 26న సాయంత్రం 6 గంటలకు వైద్యబృందం గుండెను సేకరించి ప్రత్యేక ఏర్పాట్లతో శ్రీకాకుళం రాజోలు నుండి గ్రీన్ ఛానల్ ద్వారా రోడ్డు మార్గంలో వైజాగ్‌కు బయల్దేరారు. వైజాగ్ నుండి రాత్రి 8 గంటలకు ప్రత్యేక విమానంలో బయల్దేరి రాత్రి 10.05 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో రాత్రి 10.05 గంటలకు బయల్దేరి రాత్రి 10.25 గంటలకు శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటినుండి ప్రారంభించి ఫిబ్రవరి 27న మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు గుండె మార్పిడి శస్త్రచికిత్సను పూర్తి చేశారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.