షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్ విజేత సిఇ శ్రీనాగేశ్వరరావు
షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్ విజేత సిఇ శ్రీనాగేశ్వరరావు
తిరుపతి, 15 ఫిబ్రవరి 2023: టీటీడీ ఉద్యోగుల క్రీడాపోటీల్లో భాగంగా భాగంగా బుధవారం జరిగిన సీనియర్ అధికారుల షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్ పోటీల్లో చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వరరావు విజేతగా నిలవగా, ప్రిన్సిపాల్ శ్రీ బి.సురేంద్ర రన్నరప్ గా నిలిచారు.
– సీనియర్ అధికారుల షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్ పోటీల్లో డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, డీఈవో శ్రీ భాస్కర్ రెడ్డి విజయం సాధించగా, ఇఇలు శ్రీ శివరామకృష్ణ, శ్రీ మల్లిఖార్జున ప్రసాద్ రన్నర్స్ గా నిలిచారు.
– సీనియర్ మహిళా అధికారుల టెన్నికాయిట్ పోటీల్లో డాక్టర్ రేణుదీక్షిత్, డాక్టర్ కుసుమకుమారి విజయం సాధించగా, డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత, ప్రిన్సిపాల్ డా. నారాయణమ్మ రన్నర్స్ గా నిలిచారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.