TIMELY TESTS OF BP & SUGAR AT EARLY STAGE WILL HELP IN THE PREVENTION OF DISEASE- EXPERTS TO TTD EMPLOYEES AT AWARENESS CAMP _ షుగర్,బిపి వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తిస్తే సమస్యే ఉండదు – టీటీడీ ఉద్యోగులకు అవగాహన సదస్సులో వైద్య నిపుణులు
Tirupati,11 February 2023: Medical experts in the field diabetes and cardiac care on Saturday advised the TTD employees to undergo timely test for Sugar and BP for healthy treatment.
Addressing a three-day wellness awareness session at Mahati auditorium the experts from Apollo hospital made a power point presentation to strike home the awareness among male employees of TTD to whom the awareness program is exclusively designed for.
Among them Dr Jayaprakash Sai, Dr Sai Krishna, Dr Srinivas Kumar and Dr Srinivas highlighted the precautions,early Medicare,balanced diet and hygienic practices besides treatment for Heart ailments,Hypertension and Diabetes.
TTD officials felicitated the doctors with shawls and Srivari Prasadam.
Earlier a cultural show by faculty of SV College of Music and Dance enthralled employees and invitees.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
షుగర్,బిపి వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తిస్తే సమస్యే ఉండదు – టీటీడీ ఉద్యోగులకు అవగాహన సదస్సులో వైద్య నిపుణులు
తిరుపతి 11 ఫిబ్రవరి 2023: షుగర్, బిపి వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన వైద్య సహాయం తీసుకుంటే వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెప్పారు.
టీటీడీ లోని పురుష ఉద్యోగులకు జీవనశైలి రుగ్మతలపై మూడు రోజుల పాటు నిర్వహించే అవగాహన సదస్సు శనివారం మహతి ఆడిటోరియంలో ప్రారంభమైంది.
ఈ సందర్బంగా అపోలో ఆసుపత్రికి చెందిన వైద్య నిపుణులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉద్యోగులకు సులువుగా అర్ధమయ్యే రీతిలో అవగాహన కల్పించారు.
డాక్టర్ జయప్రకాష్ సాయి షుగర్ వ్యాధి ఎందుకు, ఎలా వస్తుంది, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చాక తీసుకోవాల్సిన వైద్య సహాయం గురించి వివరించారు.
డాక్టర్ సాయి కృష్ణ షుగర్ వ్యాధి గ్రస్తులు ఎలాంటి వ్యాయామం చేయాలి, ఆహార సమతుల్యత ఎలా పాటించాలి అనే వివరాలు తెలియజేశారు.
డాక్టర్ శ్రీనివాస్ షుగర్ వ్యాధి గ్రస్తులు తమ పాదాలను శుభ్రంగా ఎలా ఉంచుకోవాలి, ఎందుకు ఉంచుకోవాలనే విషయాలు తెలియజేశారు. పాదాలను జాగ్రత్తగా కాపాడుకోకపోయినా, ఫంగల్ ఇన్ఫెక్షన్లను అజాగ్రత చేసినా జరిగే దుష్పరిణామాలను తెలియజేశారు.
డాక్టర్ శ్రీనివాస్ కుమార్ గుండె జబ్బులు, హైపర్ టెన్షన్, బిపి వల్ల ఎదురయ్యే సమస్యలు వివరించారు. గుండె జబ్బులు రాకుండా చూసుకునే జాగ్రత్తలు, వచ్చాక తీసుకోవాల్సిన చికిత్సల గురించి వివరించారు.
ఈ సందర్బంగా టీటీడీ అధికారులు వైద్య నిపుణులను శాలువతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు.
టీటీడీ ఉద్యోగులకు ఆరోగ్య రుగ్మతలపై అవగాహన కలిగించే అవకాశం శ్రీ వేంకటేశ్వర స్వామి తమకు కల్పించారని వైద్య నిపుణులు సంతోషం వ్యక్తం చేశారు.
అంతకు ముందు శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలకు చెందిన శ్రీ సుధాకర్ (మృదంగం) శ్రీ అనంత కృష్ణ ( వేణుగానం) శ్రీ కృష్ణ ( వయోలిన్) చేసిన ప్రదర్శన ఉద్యోగులు, అథితులను అలరించింది.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది