”సంగీత నృత్య కళాశాలకు తాళం” అని ప్రచురించిన వార్త నిజం కాదు

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.
వివరణ, జూన్‌ 26, 2011

”సంగీత నృత్య కళాశాలకు తాళం” అని ప్రచురించిన వార్త నిజం కాదు

జూన్‌ 24వ తేదిన ”సాక్షి” దినపత్రిక నందు ప్రచురించిన ”సంగీత నృత్య కళాశాలకు తాళం” అని ప్రచురించిన వార్త నిజం కాదు.
 
సంగీతమదైవదత్తమైనవిద్య. అభ్యసించడానికి ఇతర కోర్సులవలె త్వరగా ముందుకు రారు. ప్రతి విద్యా సంవత్సరంలాగే ఈ మారుకూడా అప్లికేషన్స్‌ దాదాపు 250 పైనే అమ్ముడు పోవడం. ఏనాటికానాడు బాంకులో పైకం జమకట్టడం జరుగుతుంది. మరి ఐదు అప్లికేషన్‌లే వచ్చాయి అనడంలో అంతరార్థమేమిటో తెలియలేదు.

2005లో నియమితులైన అధ్యాపకులందరూ ఆకాశవాణి జు మరియు ఔనీ,ఐనీ గ్రేడ్‌ కళాకారులు. అంతకు మునుపు 1984లో నియమితులైన వారిలోనూ ఆకాశవాణి కళాకారులున్నారు. అధ్యాపకులకు ఏడాదికి 15 క్యాజువల్‌ లీపులు, 7 స్పెషల్‌ క్యాజువల్‌ లీవులు ఉంటాయి. కళకళ కొరకేనన్నట్లు టీచింగుతో పాటు ఏదైనా కార్యక్రమానికి హాజరైతే లీవు పెట్టి వెళ్తారుకాని గైరుహాజరు కారు. అవసరసమయాల్లో లీవు వాడుకోవడం సమంజసమే కదా! మనదేవస్థాన ఉద్యోగులు ఇతర ప్రదేశాలలో ఇతర కార్యక్రమాలలో పాల్గొనడం (అదే తమ రెగ్యులర్‌ డ్యూటీస్‌కి భంగంకాకుండా) మనకే గర్వ కారణం కదా! ప్రతీసారీ సీరియల్‌గా సంగీతనృత్య కళాశాల గూర్చి ప్రచురించడం పరిపాటి. అలా అని సమాధానం చెప్పకుంటే అవి అనీ సత్యాలని తలడిగ్గినట్టేతూదని ఇలా ప్రత్యుత్తర మివ్వడం ప్రధమం.

ఇక్కడి అధ్యాపకులు టీచింగ్‌ మాత్రమేకాక తిరుమల,తిరుచానూరులలో ఊంజల్‌ సేవలు, అన్నమాచార్య కళామందిరం (మంగళ, బుధ, శుక్రవారాలలో)లో తమ అమూల్యసేవలందిస్తున్నారు. ఇంతేకాక ఇతర దేవాలయాలు తదితర కార్యక్రమాలకు కూడా విద్యార్థినీ విదార్థులు, అధ్యాపకులు హాజరౌతున్నారు. నాదనీరజన కార్యక్రమానికి యాంకర్‌ గా ఉన్నారు.
 
  కృష్ణదేవరాయశతజయంత్యుత్సవాల్లో, చిత్తూరుజిల్లా శతజయంత్యుత్సవాలలో అనేక కార్యక్రమాలలో పాల్గొని కళాశాలకు మంచిపేరు ప్రతిష్ఠలు తెస్తున్నట్లు మేంభావిస్తున్న నేపథ్యంలో ఇలా ఎందుకు ప్రచురిస్తున్నారో ఎవరి ప్రోద్భలమో ఊహకందడం లేదు.

”కాంట్రాక్టు లెక్చరర్లకు పదోన్నతి” అన్న మరో హెడింగ్‌ అసలు పదవే శాశ్వతం కానపుడు ”పదోన్నతి” ఎక్కడిది? ఎలా అవుతుంది?
కనుక ఈ సమాచారాన్ని రేపటి మీ దినపత్రిక నందు వివరణగా ప్రచురించాల్సిందిగా కోరడమైనది.
 
ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి