సనాతన ధార్మిక విజ్జాన పరీక్షల‌ విజేతల‌కు బహుమతుల ప్రదానోత్సవం తేదీ మార్పు

సనాతన ధార్మిక విజ్జాన పరీక్షల‌ విజేతల‌కు బహుమతుల ప్రదానోత్సవం తేదీ మార్పు

తిరుపతి, డిశెంబర్‌-14, 2009: తిరుమల తిరుపతి దేవస్థానముల, హిందూ ధర్మప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా 28వ రాష్ట్రస్థాయి సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలు జరిగాయి. ఇందులో పాల్గొని విజేతలుగా నిలచిన విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం ఈనెల 15వ తేది తిరుపతి మహతి ఆడిటోరియంనందు జరగవలసివుంది. అయితే కొన్ని అనివార్యకారణాల వలన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేయవలసి వచ్చినది. ఈ మార్పును విద్యార్థులు గమనించగలరని మనవి. తదుపరి బహుమతి ప్రధానోత్సవ తేదీలు తెలియజేయబడతాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.