MARYADA PURUSHOTTAM ON SARVABHOOPALA _ సర్వభూపాల వాహనంపై జగదభిరాముని అభ‌యం

Tirupati, 08 April 2024: As a part of the ongoing annual Brahmotsavams in Sri Kodanda Rama Swamy temple in Tirupati, Sri Ramachandra Murty rides on Sarvabhoopala Vahanam.

On Monday evening, the deity seated majestically, took out celestial ride along mada streets to bless the devotees.

Both the Pontiffs of Tirumala, HH Sri Pedda Jeeyar Swamy, and HH Sri Chinna Jeeyar Swamy, DyEO Smt Nagaratna and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

సర్వభూపాల వాహనంపై జగదభిరాముని అభ‌యం

తిరుపతి, 2022 ఏప్రిల్ 08: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులకు అభయమిచ్చారు.

భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

సర్వభూపాలురు అంటే అందరు రాజులు అని అర్థం. ”రాజా ప్రజారంజనాత్‌” అన్నట్లు ప్రజలను రంజింపజేసేవారే రాజులు. ఈ రాజులందరికీ రాజాధిరాజు భగవంతుడు.

వాహ‌న‌సేవ‌లో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శ్రీ నాగరత్న, ఏఈవో శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్‌ శ్రీ సోమశేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.