SRINIVASA BLESSES IN SRI KODANDARAMA ALANKARAM DURING SHASRA DEEPALANKARA SEVA IN NELLORE _ సహస్రదీపాలంకార సేవలో శ్రీ కోదండరాముడి అలంకారంలో శ్రీనివాసుడి అనుగ్రహం
Tirupati,18 August 2022: On Day 3 the ongoing Sri Venkateswara Vaibhavotsam fete at Sri Potti Sriramulu Nellore district on Thursday evening during Sahasra Deepalankara Seva Srinivasa blessed devotees in Sri Kodandarama Alankaram.
As Veda pundits chanted Chatur Veda Parayanam swami gave a cynosure appearance to devotees on Unjal at the AC Subba Reddy stadium. The Seva was followed by the Annamaiah Sankeertans by a team of artists of the TTD Annamacharya project.
Later Swamy was paraded around the Dais on a Tiruchi and after Nitya Kainkaryams, Swami will be offered Ekantha seva in the night.
CHINNI KRISHNAS AND GOPIKAS
As Gokulasthami is slated on August 19, children dressed as Sri Krishna and Radhas appeared in cute attires at AC Subba Reddy Stadium which attracted the participants.
On the other hand, the devotional cultural programmes stood as a special attraction.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సహస్రదీపాలంకార సేవలో శ్రీ కోదండరాముడి అలంకారంలో శ్రీనివాసుడి అనుగ్రహం
నెల్లూరు, 2022 ఆగస్టు 18: నెల్లూరు ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో మూడవ రోజైన గురువారం సాయంత్రం సహస్రదీపాలంకార సేవలో
శ్రీ కోదండరాముడి అలంకారంలో శ్రీనివాసుడు భక్తులను అనుగ్రహించారు. భక్తులు స్వామివారి వైభవాన్ని దర్శించి తన్మయత్వం చెందారు. చల్లటి సాయంత్రం వేళ ఆహ్లాదకర వాతావరణంలో స్వామివారు ఉల్లాసంగా ఊయలలో ఊగుతూ భక్తులకు కనువిందు చేశారు.
ముందుగా వేద పండితులు చతుర్వేద పారాయణం చేశారు. ఆ తరువాత టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ బృందం పలు అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు.
సాయంత్రం 6.30 నుంచి రాత్రి వేదిక చుట్టూ స్వామివారు తిరుచ్చిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారు. రాత్రి 8.30 నుంచి 9.00 గంటల వరకు ఏకాంతసేవ జరుగనుంది.
ఈ కార్యక్రమంలో ఎంపి , కార్యక్రమ నిర్వాహకులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి , టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్ష్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు
ఇదిలా ఉండగా , గురువారం ఉదయం నమూనా ఆలయంలో వందలాదిమంది బాలబాలికలు శ్రీకృష్ణుడు గోపికలు వేషధారణలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.