COME OUT WITH CONCRETE ACTION PLAN FOR SAMUHIKA SHRAMADANAM ON MAY 13-TTD EO _ సామూహిక శ్రమదాన కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేయండి: టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి 

TIRUPATI, 02 MAY 2023: The TTD EO Sri AV Dharma Reddy on Tuesday directed the officials concerned to come out with a concrete action plan for performing “Samuhika Shramadanam” on May 13. 

During a review meeting held at his chambers in TTD Administrative Building in Tirupati on Tuesday, the EO said the programme is mulled to make Tirumala a Plastic-free zone. Drawing inspiration from the sanitary works carried out by the TTD employees along with the srivari sevaks who voluntarily took part in the Sundara Tirumala-Suddha Tirumala programme, Samuhika Shramadanam has been conceptualized. 

   

The EO discussed in length on the requirement of materials to be given to the staff who are to be deployed for the community cleaning programme in both the Ghat roads and footpath routes. “Come out with a minute plan over the requirement of the staff, materials to be given to them including gloves, masks etc. along with cleaning materials, and the food and water arrangements to be made to them.

 

He also said, enough vehicles need to be pressed into service to transport employees and srivari sevaks to the duty spots in ghats and footpaths. Similarly to transport the waste to the dumping yard vehicles should be arranged”, he added.

“Divide each ghat into four sectors and appoint one senior officer as in-charge of the area. A committee with both the JEOs, CVSO, SE 2, Health Officer, PRO, GM Transport and DyEO HR has been appointed to supervise the works.

JEO for Health and Education Smt Sada Bhargavi, CVSO Sri Narasimha Kishore, CE Sri Nageswara Rao, SE 2 Sri Jagadesshwar Reddy, Health Officer Dr Sridevi, CAuO Sri Sesha Sailendra, GM Transport Sri Sesha Reddy, DyEO HR Sri Govindarajan were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

సామూహిక శ్రమదాన కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేయండి: టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి

తిరుపతి 2 మే 2023: ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమలను ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా మార్చడానికి మే 13న నిర్వహిస్తున్న సామూహిక శ్రమదాన కార్యక్రమం విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.

తిరుపతి టీటీడీ పరిపాలనభవనంలోని తన చాంబర్లో మంగళవారం ఆయన
ఈ అంశంపై సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణలో పనిచేసిన ఉద్యోగుల, శ్రీవారి సేవకుల స్ఫూర్తితో రెండు ఘాట్‌రోడ్లు, నడక మార్గాలను ప్లాస్టిక్‌ రహితంగా మార్చేందుకుసామూహిక శ్రమదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఇందుకోసం ఎంతమంది సిబ్బంది కావాలి, వారికి ఎలాంటి సదుపాయాలు కల్పించాలి అనే విషయాలపై ఈవో అధికారులతో చర్చించారు. ఉద్యోగులు , శ్రీవారి సేవకులకు అవసరమైన మాస్కులు, బకెట్లు, చీపుర్లు, తాగునీరు, అల్పాహారం సిద్ధం చేసుకోవాలన్నారు. శ్రీవారి సేవకులు, సిబ్బంది రవాణా కు అవసరమైన వాహనాలు ముందుగానే సిద్ధం చేయాలని ఆయన చెప్పారు.

ఘాట్ రోడ్లు, నడక మార్గాల్లో పోగయ్యే చెత్తను డంపింగ్ ప్రాంతాలకు తరలించేందుకు వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు. ఒక్కో ఘాట్ రోడ్డును 4 సెక్టార్లుగా విభజించుకుని, ఒక సెక్టారుకు ఒక సీనియర్ ఆఫీసర్ ను ఇంచార్జ్ గా నియమించాలని ఈవో ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జేఈవో లు, సివిఎస్వో, సిఈ, పిఆర్వో, ఎస్ ఈ 2, ఆరోగ్యాధికారి, రవాణా విభాగం జిఎం, డిప్యూటీ ఈవో ( హెచ్ ఆర్) లతో కమిటీ ఏర్పాటు చేశారు.

జేఈవో శ్రీమతి సదా భార్గవి, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శ్రీ శేష శైలేంద్ర, సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ ఈ 2 శ్రీ జగదీశ్వర రెడ్డి, ఆరోగ్యాధికారి డాక్టర్ శ్రీదేవి, విజివో శ్రీ మనోహర్, రవాణా జిఎం శ్రీ శేషారెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్ ఈ సమీక్షలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.