SRI RAMACHANDRA GRACES ON SIMHA VAHANA _ సింహ వాహనంపై శ్రీ రామచంద్రమూర్తి తేజోవిలాసం
Tirupati, 15 March 2021: On the third day during the ongoing annual Brahmotsavams of Sri Kodandarama Swamy temple at Tirupati Sri Ramachandra Swamy blessed devotees riding Simha Vahana on Monday in Ekantham due to Covid guidelines.
Simha is a symbol of bravery, leadership, strength and Sri Kodandarama is an embodiment of all virtues.
After Vahana Seva Snapana Tirumanjanam was performed for utsava idols of Sri Sitalakshmana Sameta Sri Kodandarama Swamy in the afternoon.
Tirumala Pontiffs Sri Sri Sri Pedda Jeeyarswamy, Sri Sri Sri Chinna Jeeyarswamy, Special Grade DyEO Smt Parvati, AEO Sri Durgaraju, Superintendent Sri Ramesh, Temple Inspectors Sri Muniratnam Sri Jayakumar and Archakas were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సింహ వాహనంపై శ్రీ రామచంద్రమూర్తి తేజోవిలాసం
తిరుపతి, 2021 మార్చి 15: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు సోమవారం ఉదయం సింహ వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు. కోవిడ్ -19 నేపథ్యంలో ఈ కార్యక్రమం ఉదయం 8 నుండి 9 గంటల వరకు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతులవుతాయి. పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహము సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా స్వామివారు భోదిస్తున్నారు.
వాహన సేవ అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంలతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముల వారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.
కాగా సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8 నుండి 9 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై రాములవారు కనువిందు చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.