SUNDARAKANDA SEVENTH SARGA PARAYANAMS ENDS _ సుందరకాండ స‌ప్త‌మ స‌ర్గ పూర్తి : గురువారం అఖండ పారాయణం

AKHANDA PARAYANAM FROM THURSDAY

Tirumala, 5 Aug. 20: The Sapthama Sarga Parayanam of akhanda Sundara Kanda organised by TTD for relief to humanity from pandemic Coronavirus concluded on 56th day, Wednesday.

The 227 slokas of akhanda parayanams, held at the Nada Niranjanam platform daily since June last, will conclude tomorrow, Thursday, August 6.

Speaking on the occasion Sri KS Subramaniam Avadhani, principal of Dharmagiri Veda vijnan peetham said it was a good omen that the sapthama sarga parayanams of Akhanda Sundara Kanda parayanam on Wednesday has coincided with the Ram janmabhoomi foundation ceremony at Ayodhya.

He said the Sundara Kanda parayanams began on June 11th at Nada Niranjanam platform for getting relief to humanity from pandemic Covid-19. TTD organised parayanams live telecast by SVBC were recanted by the devotees from their homes as pundits explained the meanings and significance of the slokas

It is well known that the parayanams of prasthama sargas of akhanda Sundara Kanda comprising of 211 shlokas were completed on July 7. Similarly, 200 Veda pundits will perform parayanams of 2-7thsarga of 227 shlokas on Thursday.

TTD appealed to devotees to watch the SVBC live telecast of the parayanams and beget blessings of Sri Venkateshwara.

Earlier artists of TTD’s Annamacharya project rendered Sri Rama sankeertans.

TTD additional EO AV Dharma Reddy, Dyeo of reception Sri Balaji participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సుందరకాండ స‌ప్త‌మ స‌ర్గ పూర్తి   :  గురువారం అఖండ పారాయణం
 
తిరుమ‌ల‌, 2020 ఆగస్టు 05: తిరుమ‌ల  నాద నీరాజ‌నం వేదిక‌పై టిటిడి నిర్వ‌హిస్తున్న‌ సుంద‌రకాండ పారాయ‌ణంలో 56వ రోజైన బుధ‌వారం స‌ప్త‌మ స‌ర్గ పూర్త‌యింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం  227 శ్లోకాలను అఖండ పారాయణం చేయనున్నారు.
 
సుందరకాండ పారాయణం కార్యక్రమం నిర్వహిస్తున్న  తిరుమ‌ల‌ ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని మాట్లాడుతూ ‌లోక క్షేమం కొర‌కు శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి అవ‌తార‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌రుస్వామివారి స‌న్నిధిలో అఖండ ‌సుంద‌రకాండ పారాయ‌ణ స‌ప్త‌మ స‌ర్గ‌ పూర్త‌యిన బుధ‌వారంనాడు  అయోధ్య‌లో శ్రీ‌రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జ‌ర‌గ‌డం యాదృచ్చికమే అయినా అద్భుత‌మన్నారు. ప్ర‌తి రోజు సంక‌ల్పంలో లోకం సుభిక్షంగా ఉండేందుకు శ్రీ‌రామ‌రాజ్యం రావాల‌ని ప్రార్థ‌న చేస్తున్న‌ట్లు తెలిపారు. సుద‌ర‌కాండ పారాయ‌ణంలో మ‌న‌మంద‌రం భాగ‌స్వాములు కావ‌డం పూర్వ‌జ‌న్మ సుకృత‌మ‌న్నారు.     
 
ప్ర‌పంచాన్ని క‌రోనా నుండి ర‌క్షించేందుకు తిరుమ‌ల‌లోని నాద నీరాజ‌నం వేదిక‌పై  జూన్ 11వ తేదీ నుండి సుంద‌ర‌కాండ పారాయ‌ణం ప్రారంభించారు. ఇందులోని శ్లోకాల‌ను భ‌క్తుల‌తో ప‌లికించి అర్థ‌ తాత్ప‌ర్యాల‌తో పాటు ఆ శ్లోక ఉచ్చా‌‌ర‌ణ వ‌ల‌న క‌లిగే ఫ‌లితం,  ఆధునిక స‌మాజంలోని మాన‌వాళికి ఏవిధ‌‌మైన సందేశం ఇస్తుందో వివ‌రిస్తూ నిరంత‌రాయంగా ఈ కార్య‌క్ర‌మాన్ని టిటిడి నిర్వ‌హిస్తోంది.  
 
జూలై 7వ తేదీ సుంద‌రకాండ ప్ర‌థ‌మ సర్గ సంపూర్ణంగా 211 శ్లోకాల‌తో అఖండ పారాయ‌ణం నిర్వ‌హించిన విష‌యం విదిత‌మే. అదేవిధంగా ఆగ‌స్టు 6వ తేదీ గురువారం ఉద‌యం 7.00 గంట‌లకు సుంద‌ర‌కాండ ద్వితీయ సర్గ నుంచి సప్తమ సర్గ వరకు ఉన్న మొత్తం 227 శ్లోకాలను సుమారు 200 మంది వేదపండితులు అఖండ పారాయణం నిర్వ‌హించ‌నున్నారు. భ‌క్తులు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్షప్రసారంలో వీక్షించి తమ తమ ఇళ్ళనుంచే తాము పారాయణం చేసి తిరుమలేశుని అనుగ్రహాన్ని పొందాలని టిటిడి కోరుతోంది. 
 
అంత‌కుముందు టిటిడి అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీ‌రామ సంకీర్త‌న‌లు ఆల‌పించారు. 
 
ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, రిసెప్ష‌న్ డెప్యూటీ ఈవో శ్రీ బాలాజి పాల్గొన్నారు.  
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.