DISTRIBUTION OF SWARNAPRASHANA MEDICINE ON 10th SEPTEMBER _ సెప్టెంబరు 10న స్వర్ణప్రాశన ఔషధం పంపిణీ
TIRUPATI, 08 SEPTEMBER 2023: Under the auspices of SV Ayurvedic Hospital of TTD, Swarnaprashana medicine will be distributed to the students of SV Balamandiram on Sunday.
This medicine is prepared with gold and other herbs.
Children between six months to 16 years of age can take this medicine.
The significance of this medicine is that our ancestors informed us about this medicine in Kashyapa Samhita of Ayurveda.
Ayurvedic doctors said that due to this, life expectancy increases along with immunity, intelligence, memory and digestion in children.
Arrangements are being made for the distribution of this medicine under the supervision of SV Ayurvedic Hospital Superintendent Dr. Renu Dikshit.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సెప్టెంబరు 10న స్వర్ణప్రాశన ఔషధం పంపిణీ
తిరుపతి, 2023 సెప్టెంబరు 08: టీటీడీకి చెందిన ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి ఆధ్వర్యంలో సెప్టెంబరు 10న ఆదివారం ఎస్వీ బాలమందిరం విద్యార్థులకు స్వర్ణప్రాశన ఔషధం పంపిణీ చేయనున్నారు.
బంగారంతోపాటు ఇతర వనమూలికలతో ఈ ఔషధాన్ని తయారుచేస్తారు. ఆరు నెలల నుండి 16 ఏళ్లలోపు పిల్లలు ఈ ఔషధాన్ని తీసుకోవచ్చు. ఈ ఔషధం గురించి ఆయుర్వేదంలోని కాశ్యపసంహిత గ్రంథంలో మన పూర్వీకులు తెలియజేశారు. దీనివల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి, మేథస్సు, జ్ఞాపకశక్తి, జీర్ణశక్తితో పాటు ఆయుష్షు పెరుగుతుందని ఆయుర్వేద వైద్యులు తెలిపారు.
ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రేణుదీక్షిత్ ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.