CVSO, SP REVIEW ON SECURITY OF SRIVARI BRAHMOTSAVAMS _ శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ భ‌ద్ర‌తపై సివిఎస్వో, ఎస్పీ సమీక్ష

TIRUMALA, 08 SEPTEMBER 2023: TTD CVSO Sri Narasimha Kishore and Tirupati SP Sri Parameshwar Reddy together on Friday evening discussed in length over the security arrangements for the ensuing Srivari Salakatla Brahmotsavams to be held in Tirumala from September 18 to 26.

They reviewed with their respective personnel over the security arrangements to be made on special days like visit of the Honourable Chief Minister of AP, Garuda Seva, Rathotsavam and Chakra Snana keeping in view the past experiences.

The meeting also reviewed on the steps to be taken to provide additional parking spaces along with installation of sign boards without any problems for the devotees coming for Brahmotsavams in vehicles. 

They directed their cops to ensure hassle-free arrangements for the multitude of devotees coming for the annual mega festival.

Additional SP of Tirumala Sri Muniramaiah, Special Officer of Estate Division Sri Mallikarjuna, Special Officer of Annaprasadam Sri. Shastri, Deputy EO Reception Sri. Bhaskar, VGOs Sri Balireddy, Sri. Giridhar Rao, Sri. Nandakishore, Tirumala police and Vigilance-Security officers of TTD participated in this meeting.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ భ‌ద్ర‌తపై సివిఎస్వో, ఎస్పీ సమీక్ష

తిరుమల, 2023 సెప్టెంబరు 08: తిరుమ‌లలో సెప్టెంబ‌రు 18 నుండి 26వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు, అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు జరుగనున్న నవరాత్రి బ్ర‌హ్మోత్స‌వాల భద్రత ఏర్పాట్లపై టీటీడీ సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, తిరుపతి ఎస్పీ శ్రీ పరమేశ్వర్ రెడ్డి కలిసి శుక్రవారం సాయంత్రం తిరుమల అన్నమయ్య భవనంలో పోలీసు, విజిలెన్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

బ్ర‌హ్మోత్స‌వాల్లో ధ్వ‌జారోహ‌ణం రోజున గౌ..ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌, గ‌రుడ సేవ‌, ర‌థోత్స‌వం, చ‌క్ర‌స్నానం లాంటి విశేష‌మైన రోజుల్లో గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. బ్ర‌హ్మోత్స‌వాల‌కు వాహ‌నాల్లో వ‌చ్చే భ‌క్తుల‌కు ఇబ్బందులు లేకుండా పార్కింగ్ ప్ర‌దేశాల‌కు సూచిక‌బోర్డుల ఏర్పాటుతోపాటు అద‌నంగా పార్కింగ్ ప్ర‌దేశాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. భ‌క్తుల‌కు ఇబ్బందులు లేకుండా ముఖ్య‌మైన ప్రాంతాల్లో ప‌టిష్ట‌మైన బందోబ‌స్తు ఏర్పాటు చేస్తామ‌న్నారు.

ఈ స‌మావేశంలో తిరుమల అదనపు ఎస్పి శ్రీ మునిరామయ్య, ఎస్టేట్ విభాగం ప్రత్యేకాధికారి శ్రీ మల్లికార్జున, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ శాస్త్రి, డెప్యూటీ ఈఓ శ్రీ భాస్కర్, విజివోలు శ్రీ బాలిరెడ్డి, శ్రీ గిరిధర్ రావు, శ్రీ నందకిషోర్ ఇత‌ర పోలీసు, విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.