సెప్టెంబరు 16న ఒలింపిక్‌ విజేత సైనా నెహ్వాల్‌కు పౌరసన్మానం

సెప్టెంబరు 16న ఒలింపిక్‌ విజేత సైనా నెహ్వాల్‌కు పౌరసన్మానం

తిరుపతి, 2012 సెప్టెంబరు 15: యావత్‌ భారతజాతి గర్వించే క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించి మొట్టమొదటిసారిగా తిరుమల శ్రీవారి ఆశీస్సులు అందుకునేందుకు వస్తున్న సందర్భంగా సెప్టెంబరు 16వ తేదీ ఉదయం 10.30 గంటలకు తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఘనంగా పౌరసన్మానం జరుగనుంది. భారతదేశ గౌరవాన్ని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పిన సైనా నెహ్వాల్‌కు జరుగనున్న ఈ పౌరసన్మానానికి పురప్రజలు, అలాగే క్రీడాభిమానులు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరడమైనది.
             
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.