సెప్టెంబరు 5 నుండి 8వ తేదీ వరకు విజయనగరం జిల్లాలో గోవింద కళ్యాణాలు

సెప్టెంబరు 5 నుండి 8వ తేదీ వరకు విజయనగరం జిల్లాలో గోవింద కళ్యాణాలు

తిరుపతి, 2012 ఆగస్టు 26: తితిదే శ్రీ కళ్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో సెప్టెంబరు 5 నుండి 8వ తేదీ వరకు ఏజెన్సీ ప్రాంతమైన విజయనగరం జిల్లాలో గోవింద కళ్యాణాలను వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు తితిదే రాష్ట్రంలోనే గాక దేశ విదేశాల్లో శ్రీనివాస కళ్యాణాలు నిర్వహిస్తోంది.

ఇందులో భాగంగా సెప్టెంబరు 5వ తేదీన కోమటిపల్లి, సెప్టెంబరు 6న మక్కావు మండల కేంద్రం, సెప్టెంబరు 8వ తేదీన మక్కావు మండ లంలోని దుగ్గేరు గ్రామాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. సుదూర ప్రాంతాల నుండి వ్యయ ప్రయాసల కోర్చి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోలేని భక్తులకు ఈ కళ్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి. శ్రీ కళ్యాణోత్సవం ప్రాజెక్టు ఓఎస్‌డి శ్రీ కె.రామకృష్ణ ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.