సెప్టెంబరు 9న మొదటి ఘాట్ రోడ్డులో వినాయక చవితి పూజ
సెప్టెంబరు 9న మొదటి ఘాట్ రోడ్డులో వినాయక చవితి పూజ
తిరుపతి, సెప్టెంబరు 08, 2013: తితిదే రవాణా విభాగం ఆధ్వర్యంలో తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో గల వినాయక స్వామివారి ఆలయంలో సోమవారం వినాయక చవితి పూజ జరుగనుంది. ఉదయం 10.00 నుండి 11.20 గంటల మధ్య ప్రత్యేకంగా పూజలు నిర్వహించనున్నారు. తితిదే ఉన్నతాధికారులు పాల్గొంటారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది