సెప్టెంబర్ 21 నుండి 29 వరకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
సెప్టెంబర్ 21 నుండి 29 వరకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుమల, ఆగష్టు -19, 2009: కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 21 నుండి 29 వరకు కన్నుల పండుగగా నిర్వహిస్తారు. సెప్టెంబర్ 20న అంకురార్పణ నిర్వహిస్తారు. ఈసందర్భంగా బ్రహ్మోత్సవాలలో రోజువారి వాహన సేవలు ఈవిధంగా వున్నాయి.
ఉదయం సాయంత్రం
21-09-2009 ధ్వజారోహణం (సాయంత్రం 6.00 నుండి 6.30 మధ్య), పెద్దశేషవాహనం
22-09-2009 చిన్నశేషవాహనం హంసవాహనం
23-09-2009 సింహవాహనం ముత్యపుపందిరి వాహనం
24-09-2009 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
25-09-2009 మోహినీఅవతారం గరుడవాహనం
26-09-2009 హనుమంతవాహనం గజవాహనం
27-09-2009 సూర్యప్రభవాహనం చంద్రప్రభ వాహనం
28-09-2009 రథోత్సవం అశ్వవాహనం
29-09-2009 చక్రస్నానం ధ్వజావరోహణం
ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించాల్సిన ఆర్జితసేవలు రద్దుచేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.