PAVITROTSAVAMS IN NARAYANAVANAM ON SEPTEMBER 19, 20 _ సెప్టెంబ‌రు 19, 20వ తేదీల్లో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

TIRUPATI, 17 SEPTEMBER 2021:  The annual Pavitrotsavams in Sri Kalyana Venkateswara Swamy temple at Narayanavanam will be observed on September 19 and 20 in Ekantam in adherence to Covid guidelines.

 

The Ankurarpanam will be performed on September 19 at 9:30pm while on September 20 Snapana Tirumanjanam will be performed to the utsava murthies followed by Pavitramala Samarpana.

 

In the evening, the utsava murthies will be paraded on a celestial procession within the temple premises.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబ‌రు 19, 20వ తేదీల్లో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుప‌తి, 2021 సెప్టెంబ‌రు 17: నారాయ‌ణ‌వ‌నం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో సెప్టెంబ‌రు 19, 20వ తేదీల్లో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం సెప్టెంబ‌రు 19న సాయంత్రం 6 నుండి రాత్రి 9.30 గంటల వ‌ర‌కు మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వ‌హిస్తారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాలు నిర్వ‌హిస్తారు.

ఆల‌యంలో తెలియక జ‌రిగిన దోషాల నివార‌ణకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. పవిత్రోత్సవాలలో వేదపఠనం, ఆలయశుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సెప్టెంబ‌రు 20న ఉద‌యం 8.30 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయి. త‌రువాత ఉద‌యం 10.30 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం చేప‌డ‌తారు.

అనంత‌రం మ‌ధ్యాహ్నం 12 నుండి 1 గంట వ‌ర‌కు ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌, సాయంత్రం 5.30 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఆల‌య ప్రాంగ‌ణంలో స్వామి, అమ్మ‌వార్ల ఊరేగింపు నిర్వ‌హించ‌నున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.