SWAMY SHINES ON SWARNA RATHAM _ స్వర్ణరథంపై కాంతులీనిన శ్రీ కల్యాణ వెంక‌టేశ్వ‌ర‌స్వామి

Tirupati, 20 May 2022: The procession of Sri Kalyan Venkateswara Swami on the Golden chariot as part of the ongoing annual Vasantotsavam fete at Srinivasa Mangapuram temple was a cynosure to devotees on Friday evening.

 

Besides daily Kainkaryams, TTD organised Snapana Tirumanjanam for utsava idols in the afternoon. Later in the evening the deities paraded on Swarna Ratham on Mada streets and blessed the devotees.

 

Temple Special Grade DyEO Smt Varalakshmi, AEO Sri Gurumoorthy, Superintendent Sri Chengalrayalu, Temple Archaka Sri Balaji Rangacharyulu were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

స్వర్ణరథంపై కాంతులీనిన శ్రీ కల్యాణ వెంక‌టేశ్వ‌ర‌స్వామి

తిరుపతి, 2022 మే 20: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా శుక్ర‌వారం సాయంత్రం స్వర్ణరథోత్సవం కన్నులపండుగగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఉత్సవర్లను వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం చేప‌ట్టారు. మధ్యాహ్నం 2 నుండి 4 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పంచ ద్రవ్యాలైన పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, ప‌సుపు, చందనంల‌తో అభిషేకం చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి వ‌ర‌ల‌క్ష్మి, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూప‌రింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయులు, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.