SRIVARU  OFFERED HOLY BATH WITH 1008 KALASAS OF PARIMALA THEERTHAM _ హైదరాబాద్ లో శ్రీనివాసునికి శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం

DEVOTEES CHERISH SAHASRA KALASABHISHEKAM

HYDERABAD, 12 OCTOBER 2022: The Devotees had a divine visual of Sahasra Kalasa Abhisheka Seva offered to Sri Bhoga Srinivasa Murthi-the silver replica deity of Mula Virat, at the NTR Stadium in Hyderabad on Wednesday as part of the ongoing Sri Venkateswara Vaibhavotsavams.

After the morning sevas of Suprabhatam, Tomala, Archana, Koluvu, Nivedana and Sattumora, the unique Sahasra Kalasabhishekam was performed on Wednesday.

Besides the replica of the one-foot tall Bhoga Srinivasa Murty, the replicas of the processional deities of Sri Swamy varu along with his two consorts, Sri Viswaksena-the chief commander of Lord were also rendered the special Abhishekam on the occasion.

According to the temple legend, the idol of Sri Bhoga Srinivas Murthy was consecrated by the Pallava Queen Samavai Perundevi in 614AD and every year, to mark this auspicious occasion, TTD observed Sahasra Kalasabhishekam at Bangaru Vakili. Similar fete was replicated for the sake of devotees at Hyderabad on Wednesday.

SIGNIFICANCE OF SACRED THREAD

A sacred thread has been tied to the Bhoga Srinivasa Murty connecting with the Mula Virat inside the Garbhalayam (sanctum). One end of the rope is tied around the feet of the Bhoga Srinivasa Murthy while the other end is placed near the Kathithasta of the Mula Virat, thus symbolically establishing a relationship between the Main deity and the Bhoga Srinivas Murthy to achieve two purposes. Firstly, it becomes clear that Bhoga Srinivasa is representing the Mula Virat and secondly, it makes clear that the Pooja offered to the Bhoga Srinivasa Murthy is nothing but the puja is assumed to have offered to the main deity also.

ABHISHEKAM WITH PARIMALA THEERTHAM

Swamy with His two consorts Sridevi and Bhudevi are also brought from the Sanctum along with the idol of Viswaksena. The deities were offered holy bath with the aromatic Parimala Theertham filled in the one Thousand and Eight Silver reciting Pancha Suktas and the Pancha Shanthi Mantras by Acharya Purushas. 

The entire event lasted for nearly one and a half hours between 8.30am and 10am. The devotees who took part in this celestial ritual were immersed in the devotional waves chanting “Govinda…Govinda” with utmost religious fervour and devotion.

TIRUPPAVADA SEVA ON THURSDAY

Yet another unique and important ritual, the Tiruppavada Seva, which is usually offered on every Thursday in Tirumala temple, will be replicated during the ongoing Sri Venkateswara Vaibhavotsavams on October 13 between 8.30am and 10.30am.

One of the chief priests of Tirumala temple Sri Venugopala Deekshitulu, Agama Advisor Sri Mohanarangacharyulu, Donors Sri Harshavardhan, Sri SS Reddy, Sri Venkateswara Reddy, Sri Subba Reddy, All Projects Officer Smt Vijayalakshmi, VGO Sri Manohar, Annamacharya Project Director Dr Vibhishana Sharma, AEOs Sri Jaganmohanacharyulu, Sri Parthasaradhy, Sri Sriramulu were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

హైదరాబాద్ లో శ్రీనివాసునికి శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం
 
హైదరాబాద్, 2022 అక్టోబరు 12: హైదరాబాద్ లో టిటిడి తలపెట్టిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో రెండవ రోజైన బుధవారం ఉదయం శ్రీనివాసునికి శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించారు.
 
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన శ్రీవారి నమూనా ఆలయంలో ఈ ఉత్సవాలు జరుగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు సుప్రభాతం, ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాలసేవ, కొలువు, ఉదయం 7.30 నుంచి 8.15 గంటల వరకు అర్చన, ఉదయం 8.15 నుంచి 8.30 గంటల వరకు నివేదన, శాత్తుమొర నిర్వహించారు.
 
సహస్రకలశాభిషేకం : ఉదయం 8.30 నుంచి 10.00 గంటల వరకు
 
భోగశ్రీనివాసమూర్తి, విష్వక్సేనుడితోపాటు, శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ శ్రీనివాసస్వామి వారికి వెయ్యి కలశాలతో సహస్రకలశాభిషేకం నిర్వహించారు. ఉత్సవమూర్తులను ఉత్తరాభిముఖంగా ఉంచి, భోగశ్రీనివాసమూర్తిని తూర్పుముఖంగా, దక్షిణంగా విష్వక్సేనుడిని ఉంచారు. మూలమూర్తి నుండి భోగ శ్రీనివాసమూర్తికి పట్టుదారం కట్టి ఉంచారు.
 
పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనము తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. విశేషహోమం నిర్వహించారు. అనంతరం నైవేద్యం సమర్పించి  భక్తులను ఆశీర్వదించారు. సహస్ర(1000) కలశాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు కావున, ఈ సేవకు ‘సహస్ర కలశాభిషేకం’ అనే పేరు ఏర్పడింది. ఈ సహస్రకలశాభిషేకం ఉత్తమోత్తమ అభిషేక విధానమని ఆగమశాస్త్రంలో పేర్కొనబడింది.
 
అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు సమర్పణ, అర్చన, రెండో నివేదన నిర్వహించారు. ఉదయం 11.30 నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుంది.
 
రేపటి ప్రత్యేక సేవ….
 
వైభవోత్సవాల్లో భాగంగా అక్టోబరు 13న గురువారం ఉదయం 8.30 నుండి 10.30 గంటల వరకు తిరుప్పావడ సేవ జరుగనుంది.
 
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు,  దాతలు శ్రీ హర్షవర్ధన్‌, శ్రీ ఎస్‌ఎస్‌.రెడ్డి, శ్రీ వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీ సుబ్బారెడ్డి,  ఎస్ఇ(ఎలక్ట్రికల్) శ్రీ వెంకటేశ్వర్లు, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి శ్రీమతి విజయలక్ష్మి, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణశర్మ, విజివో శ్రీ మనోహర్, ఏఇఓలు శ్రీ జగన్మోహనాచార్యులు, శ్రీ పార్థసారథి, శ్రీ శ్రీరాములు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.  
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.