EXPERT COMMITTEE TO PRESENT THE EVIDENCE ON BIRTH PLACE OF LORD HANUMAN ON APRIL 13 ON THE OCCASION OF UGADI _ హ‌నుమంతుని జ‌న్మ‌స్థానం తిరుమ‌లగా ఏప్రిల్ 13న ఉగాది నాడు ఆధారాల‌తో నిరూపించ‌నున్న టిటిడి

Tirupati, 8 Apr. 21: Tirumala, the abode of Sri Venkateswara Swamy which is the ultimate destination of every Hindu in the world is soon to be labelled as the birth place of Sri Anjaneya, with the temple administration of Tirumala Tirupati Devasthanam all set to present epigraphical and scientific evidences confirming the same on the auspicious day of Ugadi on April 13.

In this context, a detailed review meeting was held in the chambers of TTD EO Dr KS Jawahar Reddy in the Administrative Building in Tirupati on Thursday with the Committee members who have done in-depth research since December last.

The EO has sought the scholars to come out with astronomical, epigraphical, scientific puranic evidences and salient features of that could be presented to the public on Ugadi. He also asked them to bring out a comprehensive book with these evidences proving Anjanadri as birthplace of Hanuman within a couple of months.

It may be recalled that TTD has constituted a committee in December 2020 to study in detail about the evidences that Anjanadri Hills as birthplace of Hanuman. The scholars committee comprised of Prof. Sannidhanam Sudarshana Sharma, VC of Vedic Varsity, Prof. Muralidhara Sharma, VC of National Sanskrit Varsity, professors Sri Ranisadasiva Murthy, Sri Janumaddi Ramakrishna, Sri Sankaranarayana, ISRO Scientist Sri Murthi Remilla, Deputy Director of State Archaeology Sri Vijay Kumar as members and Project Officer of Higher Vedic studies Dr A Vibhishana Sharma as Convenor. 

The Committee met several times and elaborately researched on the various evidences to strongly establish Anjanadri as birthplace of Hanuman. The evidences from Siva, Brahma, Brahmanda, Varaha, Matsya puranas, Venkatachala Mahatyam, Varahamihira Brihatsamhita proving the point that Anjanadri hills located in the abode of Sri Venkateswara Swamy is the actual birth place of Anjaneya with relevance to the dates of that aeon. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

హ‌నుమంతుని జ‌న్మ‌స్థానం తిరుమ‌లగా ఏప్రిల్ 13న ఉగాది నాడు ఆధారాల‌తో నిరూపించ‌నున్న టిటిడి

పూర్తి వివ‌రాల‌తో త్వ‌ర‌లో పుస్త‌క ముద్ర‌ణ‌

తిరుపతి, 2021 ఏప్రిల్ 08: హిందువుల ఆరాధ్య‌దైవం, క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు కొలువైన తిరుమ‌ల హ‌నుమంతుని జ‌న్మ‌స్థానంగా కూడా గుర్తింపు పొంద‌నుంది. ఏప్రిల్ 13న తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది నాడు ఈ విష‌యాన్ని పురాణాలు, శాస‌నాలు, శాస్త్రీయ‌ ఆధారాల‌తో స‌హా నిరూపించేందుకు ‌టిటిడి సిద్ధ‌మైంది.

తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల కార్యాల‌యంలో ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి గురువారం ఈ విష‌యంపై క‌మిటీ స‌భ్యుల‌తో సుదీర్ఘంగా స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ క‌మిటీలోని పండితులు జ్యోతిష శాస్త్రం, శాస‌నాలు, పురాణాలు, శాస్త్రీయ ఆధారాల‌తో ఉగాది నాడు ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌న్నారు. హ‌నుమంతుని జ‌న్మ‌స్థానం అంజనాద్రి అని నిరూపించేందుకు ఉన్న ఆధారాలు, ఇత‌ర వివ‌రాల‌తో త్వ‌ర‌లో స‌మ‌గ్ర‌మైన పుస్త‌కాన్ని తీసుకురావాల‌న్నారు.

అంజ‌నాద్రి కొండ‌లో హ‌నుమంతుడు జ‌న్మించాడ‌నే విష‌యాన్ని ఆధారాల‌తో నిరూపించేందుకు 2020 డిసెంబ‌రులో టిటిడి పండితుల‌తో ఒక క‌మిటీని ఏర్పాటుచేసిన విష‌యం విదిత‌మే. ఈ క‌మిటీలో ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుదర్శ‌న‌శ‌ర్మ‌, జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య ముర‌ళీధ‌ర శ‌ర్మ‌, ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, ఆచార్య జాన‌మ‌ద్ది రామ‌కృష్ణ‌, ఆచార్య శంక‌ర‌నారాయ‌ణ‌, ఇస్రో శాస్త్రవేత్త శ్రీ రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావ‌స్తు శాఖ డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ విజ‌య్‌కుమార్ స‌భ్యులుగా ఉన్నారు. టిటిడి ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ క‌న్వీన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ క‌మిటీలోని పండితులు ప‌లుమార్లు స‌మావేశాలు నిర్వ‌హించి లోతుగా ప‌రిశోధ‌న చేసి హ‌నుమంతుడు అంజ‌నాద్రిలోనే జ‌న్మించాడ‌ని రుజువు చేసేందుకు బ‌ల‌మైన ఆధారాలు సేక‌రించారు. శివ‌, బ్ర‌హ్మ‌, బ్ర‌హ్మాండ‌, వ‌రాహ‌, మ‌త్స్య పురాణాలు, వేంక‌టాచ‌ల మ‌హ‌త్యం గ్రంథం, వ‌రాహ‌మిహిరుని బృహ‌త్‌సంహిత గ్రంథాల ప్ర‌కారం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి చెంత గ‌ల అంజ‌నాద్రి కొండే ఆంజ‌నేయుని జ‌న్మ‌స్థాన‌మ‌ని యుగం ప్ర‌కారం, తేదీ ప్ర‌కారం నిర్ధారించారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.