హ‌నుమంత వాహ‌నంపై వేంక‌టాద్రిరామునిగా శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు

హ‌నుమంత వాహ‌నంపై వేంక‌టాద్రిరామునిగా శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు
 
తిరుమల, 2022 ఫిబ్ర‌వ‌రి 08: ర‌థ‌స‌ప్త‌మి సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 1 నుండి 2 గంట‌ల వ‌రకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో హ‌నుమంత వాహ‌నంపై శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు ద‌ర్శ‌న‌మిచ్చారు.

హ‌నుమంత వాహ‌నం – భ‌గ‌వ‌త్ భ‌క్తి ప్రాప్తి

హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.

ఈ వాహ‌న సేవ‌లో టిటిడి అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.