MALAYAPPA ON GAJA VAHANA _ గజ వాహనంపై శ్రీ మలయప్ప కటాక్షం
TIRUMALA, 02 OCTOBER 2022: On the sixth day evening, Sri Malayappa took out a celestial ride on Gaja Vahanam as part of the ongoing annual Brahmotsavams in Tirumala on Sunday.
Gaja, the elephant happens to be the favourite vehicle of Goddess Maha Lakshmi, the better half of Sri Venkateswara Swamy. Elephants stands for royalty, majesty, legacy and prosperity.
To showcase His mightiness, Malayappa takes a royal ride along the Mada streets to bless the devotees.
TTD Chairman Sri YV Subba Reddy, EO Sri AV Dharma Reddy, board members, officials and large number of devotees were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
2022 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
గజ వాహనంపై శ్రీ మలయప్ప కటాక్షం
తిరుమల, 2022 అక్టోబరు 02: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఆదివారం రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు గజ వాహనంపై భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
గజ వాహనం – కర్మ విముక్తి
రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహనం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. ఈ వాహనసేవ దర్శనం వల్ల కర్మ విముక్తి కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. స్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజేగాక, ఉత్సవాల వేళ తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ధర్మారెడ్డి దంపతులు, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి, శ్రీ సనత్ కుమార్, శ్రీ నందకుమార్, శ్రీ మారుతీ ప్రసాద్, శ్రీ రాములు, జెఈవోలు శ్రీ మతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.