DEVOTEES SHOULD WEAR MASKS WHILE COMING FOR VAIKUNTHA DWARA DARSHAN _ అధిక  సంఖ్యలో సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం 

ONLY DEVOTEES WITH TICKETS OR TOKENS ALONE ALLOWED FOR VAIKUNTHA DWARA DARSHAN

 

92 COUNTERS SET UP IN TIRUPATI TO DISTRIBUTE SSD TOKENS

 

QR CODE FACILITY ALSO ENABLED FOR THE SAKE OF DEVOTEES

 

VAIKUNTHA DWARA DARSHAN TO 10THOUSAND DEVOTEES FROM BACKWARD AREAS DURING TEN DAYS

 

GOVINDA MALA DEVOTEES SHALL COME TO TIRUMALA ONLY WITH TOKENS TO AVOID ANY INCONVENIENCE

 

NO SRIVANI TICKETS WILL BE ISSUED IN OFFLINE

 

-TTD TRUST BOARD CHAIRMAN

 

TIRUMALA, 27 DECEMBER 2022: To enable Vaikuntha Dwara Darshan to more number of devotees, TTD has been organising a ten-day Vaikunta Dwara Darshan starting from January 2-11 and this practice has been in vogue from the past three years, said TTD

Trust Board Chairman Sri YV Subba Reddy.

 

Speaking to media persons along with TTD EO(FAC) Sri Anil Kumar Singhal and other top brass officials from TTD and district administration, the Chairman said, “In view of the recent guidelines by Central and State Governments, we appeal the devotees who are coming to Tirumala for Vaikuntha Dwara Darshan to wear Masks which is mandatory. We make other arrangements like frequently sanitizing the crowded places etc. as a part of Health Safety and Security of visiting pilgrims. TTD has planned to issue a total 45,000 Slotted Sarva Darshan tickets per day from January 2 to11. 

 

The issuance of free SSD tokens will commence by 2pm of January 1 at Nine centres consisting 92 counters in Tirupati viz. Bhudevi Complex, Indira Maidan, Ramachandra Pushkarini, Jeevakona ZP high school, Vishnu Nivasam, Srinivasam, Ramanaidu Municipal High School, Seshadrinagar ZP High School in Bairagipettada and Govindarajaswami choultries 2 and 3. While four counters are earmarked in Tirumala at Koustubham Rest House exclusively for Tirumala locals.

 

All arrangements of food, water, beverages have been arranged at these counters and mobile toilets have also been erected. To facilitate the devotees coming from various neighbouring states to know about the counters, QR code facility boards have also been displayed at all these counters and also at Cherlopalle, Pudi road and Navajeevan Hospital areas.

 

The devotees with SSD tokens, shall have to report at Sri Krishna Teja Rest House in Tirumala on their specified date and time only, to avoid long waiting hours for darshan, the Chairman said.

 

SRIVANI Trust tickets will not be issued in offline. “As we have already released 2000 tickets of SRIVANI in online for each day from January 2 to 11, no tickets will be issued in offline”, he reiterated. “Similarly we have also issued 2.05lakh SED(Rs.300) tickets from January 1 to 11 in on-line”, he maintained.

 

In view of New Year Day on January 1, Vaikunta Ekadasi on January 2 and Vaikunta Dwadasi on January 3, all advance bookings in accommodation from December 29 to January 3 stands cancelled. Even the VIPs will also be allotted only two rooms as there is limited accommodation in Tirumala. In view of common devotees, no VIP referral letters for darshan on January 2 and 3 will be accepted and are requested to co-operate with the management”, he added.

 

On Vaikunta Ekadasi and Dwadasi, the darshan for common pilgrims commences by 6am and will continue till 11pm. On Vaikunta Ekadasi day Swarna Ratham procession takes place between 9am and 11 am. While on Vaikunta Dwadasi day, Chakra Snanam will be observed between 4.30am and 5.30 am.

 

OTHER ARRANGEMENTS: 

 

Among other arrangements, we are keeping ready a buffer stock of 3.50 lakh laddus for devotees, deployed 400 sanitary workers, additional barbers in Kalyanakatta, vigilance sleuths and police to safeguard the devotees. The Annaprasadam will be served from 6am till midnight. Both the Ghat roads remains open 24X7 for the convenience of the pilgrims. Three additional dispensaries and one mobile dispensary will be set up for the occasion. Parking facility in Tirumala has been created for 8000 vehicles. Wide publicity is being given via all media platforms for the sake of devotees present across the country. About 3500 Srivari Sevakulu are being invited to serve the devotees at various places. Sri Vishnu Sahasra Nama Stotra Akhanda Parayanam will be performed on the day of Vaikuntha Ekadasi on January 2 at Nada Neerajanam.

 

APPEAL TO GOVINDA MALA DEVOTEES

 

The Chairman appealed to the Govindamala devotees to come to Tirumala for Vaikuntha Dwara Darshan only with tokens to avoid any inconvenience.

 

VAIKUNTHA DWARA DARSHAN TO DEVOTEES OF BACKWARD AREAS

 

Everyday one thousand devotees from backward areas across the State, will be provided Vaikuntha Dwara Darshan during these ten days.

 

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
అధిక  సంఖ్యలో సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం 
 
– పదిరోజుల దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం 
 
– శ్రీవారి దర్శనానికి టోకెన్ తీసుకునే రండి 
 
– భక్తులు తప్పని సరిగా మాస్క్ ధరించి రావాలి 
 
– జనవరి 1, 2 తేదీల్లో సిఫారసు లేఖలు స్వీకరించబడవు 
 
  టీటీడీ  చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి 
 
తిరుమల 27 డిసెంబరు 2022: సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలనే  ఉద్దేశంతో  జనవరి 2 నుండి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని బోర్డు నిర్ణయం తీసుకుందని టీటీడీ చైర్మన్  శ్రీ వైవి సుబ్బారెడ్డి  చెప్పారు.ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు  పూర్తి  చేశామని ఆయన తెలిపారు.  
 
ఈవో  శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ , జిల్లా కలెక్టర్  శ్రీ  వెంకటరమణా రెడ్డి , అదనపు ఈవో  శ్రీ వీరబ్రహ్మం , జేఈవో  శ్రీమతి సదా భార్గవి, టీటీడీ సీవీఎస్వో  శ్రీ నరసింహ కిషోర్ , జిల్లా ఎస్పీ శ్రీ పరమేశ్వర రెడ్డి  ఇతర అధికారులతో  మంగళవారం సాయంత్రం  తిరుమల అన్నమయ్య భవనంలో ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై  సమీక్ష  జరిపారు . అనంతరం చైర్మన్  శ్రీ సుబ్బారెడ్డి  మీడియాతో  మాట్లాడారు . ఆ వివరాలు ఇవి..
 
– భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని 9 ప్రాంతాల్లో దాదాపు 92 కౌంటర్ల ద్వారా. సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది.
 
స్లాటెడ్‌ సర్వదర్శనం టోకెన్లు : 
 
– జనవరి 2 నుండి 11వ తేదీ వరకు 10 రోజులకు గాను జనవరి 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభిస్తాం. 10 రోజుల కోటా పూర్తయ్యేంత వరకు నిరంతరాయంగా 4 లక్షల 50 వేల టోకెన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాం . భక్తులకు త్వరిత గతిన దర్శనం చేయడం కోసం చేసిన ఈ ఏర్పాట్లను గమనించి భక్తులు టోకెన్ తీసుకున్నాకే తిరుమలకు రావాలని విజ్ఞప్తి.
 
– తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్‌, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, జీవకోన జడ్పీ హైస్కూల్‌, విష్ణునివాసం, శ్రీనివాసం, బైరాగిపట్టెడలోని రామానాయుడు పాఠశాల(మహాత్మాగాంధీ మున్సిపల్‌ హైస్కూల్‌), ఎమ్‌.ఆర్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ వెనుక వైపున గల శేషాద్రి నగర్‌లోని జెడ్‌పి హైస్కూల్‌, గోవిందరాజ స్వామి సత్రాల వద్ద టోకెన్లు జారీ చేస్తాం.
 
– జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సహకారంతో  ఏర్పాట్లు చేస్తాం.
 
– ఈ టోకెన్‌ కేంద్రాల వద్ద భక్తుల కొరకు అన్నప్రసాదాలు, మంచినీరు, పాలు, టి, కాఫీ అందిస్తాం. తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తాం.
 
– తిరుమల స్థానికుల కోసం కౌస్తుభం విశ్రాంతి గృహంలో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం.
 
– ఉచిత టోకెన్లు పొందిన భక్తులు తిరుమలలోని కృష్ణతేజ విశ్రాంతి గృహం వద్ద రిపోర్టు చేయాలి.
 
– తిరుపతిలో 9 ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సర్వదర్శనం కౌంటర్లకు  సులువుగా వెళ్లేందుకు వీలుగా ఆయా కౌంటర్ల వద్ద క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేశాం. భక్తులు సెల్‌ఫోన్‌ ద్వారా స్కాన్‌ చేసి గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా ఇతర ప్రాంతాల్లోని కౌంటర్లను గుర్తించవచ్చు.
 
– భక్తులకు సమాచారం ఇచ్చేందుకు గాను చెర్లోపల్లి జంక్షన్‌, తిరుచానూరు వద్ద పూడి రోడ్డు, నవజీవన్‌ ఆసుపత్రి వెనుక హైవే వద్ద తగినంత మంది సిబ్బందిని ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాంతాల్లో కూడా సమీపంలోని సర్వదర్శనం కౌంటర్ల క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేస్తాం.
 
రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు :
 
– జనవరి 1, 2 నుండి 11వ తేదీ వరకు కలిపి మొత్తం 2.05 లక్షల టికెట్లు విడుదల చేశాం.
 
శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు :
 
– జనవరి 2 నుండి 11వ తేదీ వరకు రోజుకు 2 వేలు చొప్పున దర్శన టికెట్లు  ఆన్‌లైన్‌లో విడుదల చేశాం. వీరికి కూడా మహాలఘు దర్శనం ఉంటుంది.  
 
టికెట్ల లభ్యతను తెలుసుకోండి : 
 
– భక్తులు టిటిడి వెబ్‌సైట్‌, ఎస్వీబీసీ ఇతర మాధ్యమాల ద్వారా టికెట్ల లభ్యతను ముందే తెలుసుకుని తమ తిరుమల ప్రయాణాన్ని ఖరారు చేసుకోవాల్సిందిగా మనవి.
 
– భక్తులు కిలోమీటర్ల పొడవున క్యూలైన్లలో ముందుగానే వచ్చి నిరీక్షించకుండా టోకెన్‌పై తమకు కేటాయించిన ప్రాంతానికి నిర్దేశించిన సమయానికి మాత్రమే రావాలని కోరడమైనది.
 
గదులు :
 
– నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దృష్ట్యా డిసెంబర్‌ 29 నుండి జనవరి 3 వరకు వసతి అడ్వాన్స్‌ బుకింగ్‌ రద్దు చేయడమైనది. 
 
– తిరుమలలో వసతిగృహాలు పరిమితంగా ఉన్న కారణంగా భక్తులు తాము పొందిన టికెట్లు లేదా టోకెన్లపై సూచించిన తేదీ మరియు సమయానికి మాత్రమే తిరుమలకు దర్శనానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది.
 
శ్రీవారి ఆలయం :
 
– సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 1న, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2 నుండి 11వ తేదీ వరకు స్వయంగా వచ్చే రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్న ప్రముఖులకు మాత్రమే విఐపి బ్రేక్‌ దర్శనం కల్పించడం జరుగుతుంది. ఒక వి ఐ పి కి రెండు గదులు మాత్రమే కేటాయిస్తాం.
 
– జనవరి 2 మరియు 3 వ తేదీల్లో ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఆ తరువాత రద్దీని బట్టి నిర్ణయం తీసుకుంటాము.
 
– వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.
 
– వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు.
 
– లడ్డూ కాంప్లెక్సులో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా 3.5 లక్షల లడ్డూలు బఫర్‌ స్టాక్‌ ఉంచడం జరుగుతుంది.
 
వెనుకబడిన ప్రాంతాల వారికి వైకుంఠ ద్వార దర్శనం :
 
– రాష్ట్రంలోని గిరిజన , వెనుకబడిన ప్రాంతాలకు చెందిన పేదవర్గాల వారికి రోజుకు వెయ్యి మంది చొప్పున 10 రోజులకు కలిపి సుమారు 10 వేల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తాం.
 
ఆరోగ్య విభాగం :
 
– తిరుమలలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో 400 మంది సిబ్బందితో పారిశుధ్య ఏర్పాట్లు చేస్తాం.
 
అన్నప్రసాదం :
 
– అన్నప్రసాద భవనంలో 10 రోజుల పాటు ఉదయం 6 నుండి రాత్రి 12 గంటల వరకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. అదేవిధంగా, వైకుంఠం క్యూకాంప్లెక్సు, నారాయణగిరి షెడ్లు, ఇతర ప్రాంతాల్లో అన్నప్రసాదాలు, తాగునీరు, టీ , కాఫీ పంపిణీ చేస్తాం. 
 
కల్యాణకట్ట :
 
– తలనీలాలు తీసేందుకు తగినంత మంది క్షురకులను అందుబాటులో ఉంచడం జరిగింది. 
 
వైద్యం : 
 
– భక్తులకు అవసరమైన ప్రాంతాల్లో వైద్యసేవలందించేందుకు వైద్యబృందాల ఏర్పాటు. అదనంగా 3 డిస్పెన్సరీలు, 1 మొబైల్‌ డిస్పెన్సరీ ఏర్పాటు చేస్తాం. 
 
భద్రత :
 
– టిటిడి సెక్యూరిటీ, పోలీసుల సమన్వయంతో తిరుపతి, తిరుమలలో తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. పార్కింగ్ ప్రాంతాలపై ప్రత్యేకంగా శ్రద్ద తీసుకోవాలని జిల్లా ఎస్పి , సీవీఎస్వో కు సూచించాము.
 
– భక్తుల సౌకర్యార్థం రెండు ఘాట్‌ రోడ్లు 24 గంటల పాటు తెరిచి                     ఉంచబడతాయి.
 
పార్కింగ్‌ :
 
– తిరుమలలో పోలీసులతో సమన్వయం చేసుకుని ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు.
 
– తిరుమలలో దాదాపు 8 వేల వాహనాలకు సరిపడా పార్కింగ్‌ ఏర్పాట్లు చేయడమైనది.
 
ప్రజాసంబంధాల విభాగం :
 
– భక్తులకు అవగాహన కల్పించేందుకు గాను తెలుగు, ఇంగ్లీషు, తమిళం, కన్నడ, మరాఠి పత్రికల్లో ప్రకటనలు, రేడియో, సోషల్‌ మీడియా, ప్రింట్‌ మరియు ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా విరివిగా ప్రచారం.
 
– భక్తులు తిరుపతికి రాకముందే వైకుంఠ ఏకాదశి దర్శన ఏర్పాట్లపై ముందుగానే అవగాహన కల్పించేందుకుగాను అలిపిరి, రెండు నడకమార్గాలు, ముఖ్యమైన రైల్వే జంక్షన్లు, బస్టాండ్లలో విరివిగా ప్రసారం చేయడం, కరపత్రాలు పంచడానికి ఏర్పాట్లు చేశాం.
 
శ్రీవారి సేవ :
 
– అన్ని విభాగాల్లో 3,500 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందిస్తారు.
 
ఎస్వీబీసీ :
 
– జనవరి 2న వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల నాదనీరాజన వేదికపై ఉదయం 3 గంటల నుండి 5.30 గంటల వరకు శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర అఖండ పారాయణం నిర్వహిస్తాం.
 
– భక్తులకు అవసరమైన ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు నాలుగు భాషల్లో ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశాం.
 
డిసెంబరు 31, జనవరి 1 తేదీల్లో ఎస్‌ఎస్‌డి టోకెన్ల రద్దు :
 
– డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో తిరుపతిలోని కౌంటర్లలో ఎస్‌ఎస్‌డి టోకెన్లు ఇవ్వబడవు.
 
– అదేవిధంగా, ఈ రెండు తేదీల్లో ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టికెట్లు కూడా ఇవ్వబడవు.
 
– గోవింద మాల భక్తులు టోకెన్ తీసుకునే తిరుమలకు వచ్చి దర్శనం  చేసుకోవాలని, టోకెన్ లేకుండా తిరుమలకు వచ్చి ఇబ్బంది పడవద్దని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
 
మాస్క్ ధరించి రావాలి 
     
కోవిడ్ మళ్ళీ వ్యాపిస్తున్న పరిస్థితులు నెలకొన్నందువల్ల  కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ మార్గ దర్శకాలు జారీ చేశాయి. భక్తులు పెద్ద సంఖ్యలో  వచ్చే అవకాశాలు ఉన్నందువల్ల అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో  ఉంచుకుని భక్తులందరూ తప్పని సరిగా మాస్క్ ధరించి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
 
టీటీడీ  ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది