BHAGAVAT GITA WINNERS AWARDED _ మహతి కళాక్షేత్రంలో భగవద్గీత రాష్ట్ర స్థాయి కంఠస్థం పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం

TIRUPATI, 27 DECEMBER 2022: The winners of state-level Bhagavat Gita Competitions held by TTD were given away prizes on Tuesday evening.

Special Officer of Dasa Sahitya Project Sri Anandatheerthacharya speaking on the occasion at Mahati Auditorium in Tirupati, said bout the importance of the Bhagavat Gita and how it transforms the life of a human to lead a righteous life. 

Chief Audit Officer Sri Sesha Sailendra said, Bhagavt Gita is an encyclopedia of leading a life full of ethics and the essence of the Gita is important for building a healthy society.

Alwar Divya Prabandha Project Advisor Sri Parakala said, if the children learn Bhagavat Gita then they will become the best citizens of the country.

A cash award of Rs.10thousands, Rs.7,500 and Rs.5,000 were given away to the winners who topped in first three positions respectively in various age categories.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మహతి కళాక్షేత్రంలో భగవద్గీత రాష్ట్ర స్థాయి కంఠస్థం పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం

తిరుపతి, 2022 డిసెంబ‌రు 27: హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుపతి మహతి కళా క్షేత్రంలో రాష్ట్రస్థాయి భగవద్గీత కంఠస్థం పోటీల విజేతలకు మంగళ వారం రాత్రి బహుమతులు ప్రదానం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ, భగవద్గీత మానవాళికి జ్ఞానాన్ని ప్రసాదించే అద్భుతమైన గ్రంథం అన్నారు. గీతా పఠనం ద్వారా మానసిక వికాసం కలిగి మోక్షసాధనకు మార్గం సుగమమం అవుతుందని వివరించారు. గాంధీజీని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ గీతను పఠించాలని ఆయన కోరారు.

టీటీడీ సీఏఓ శ్రీ శేష శైలేంద్ర మాట్లాడుతూ, భగవద్గీత విజ్ఞానం, వివేకం కలిగించే జ్ఞాని అన్నారు. మనిషి ఎలా జీవించాలనే విషయం రాముడి రామాయణం ద్వారా, జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అనే విషయం శ్రీకృష్ణుడి భగవద్గీత ద్వారా తెలుస్తుందన్నారు. భగవద్గీత పవిత్రత, విశిష్టత గురించి వివరించారు.

అల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సలహాదారు శ్రీ కేకే పరకాల ప్రసంగిస్తూ, విద్యార్థులు చిన్నప్పటినుంచి గీతా పఠనాన్ని అలవర్చుకుంటే అనుకున్న స్థాయికి చేరుకోగలుగుతారని చెప్పారు.

అనంతరం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుండి వచ్చిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయి భగవద్గీత కంఠస్థం పోటీలు నిర్వహించారు. ఇందులో విజేతలైన 6, 7, 8, 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ప్రథమ ,ద్వితీయ, తృతీయ బహుమతులుగా 50 గ్రాములు, 30 గ్రాములు, 15 గ్రాముల శ్రీవారి వెండి డాలర్లు బహూకరించారు.

అదేవిధంగా 18 సంవత్సరాల లోపు, పైబడిన విద్యార్థిని విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ తృతీయ బహుమతులుగా రూ 10 వేలు, రూ 7500, రూ 5000 నగదు బహుమానంగా అందించారు.

పోటీలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు ఆధ్యాత్మిక పుస్తకాలను బహుమతులు ప్రదానం చేశారు.

విజేతల వివరాలు

6,7 తరగతులు –

1. కృష్ణ హన్సిత

2. నవ్య ఆర్ వశిష్ట

3. శ్రీనిజ

8,9 తరగతులు

1. సౌమ్య

2. లక్ష్మి హంసిని

3. సత్య

18 సంవత్సరాల లోపు

1. స్వర్ణ

2.మల్లేశ్వరి

3.సరిత

18 సంవత్సరాల పైబడిన వారికి

1. భువన

2. శ్రీ కావ్య

3.దేవి ప్రణయ

ఆ తర్వాత అతిథులను, న్యాయ నిర్ణీతలను సన్మానించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.