STRENGTHEN INVENTORY MANAGEMENT SYSTEM-EO_ అన్నప్రసాదాల వృథాను అరికట్టాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 7 September 2017: Taking the recommendations made by IIM experts into consideration, our Inventory Management System need to be strengthened further, informed TTD EO Sri Anil Kumar Singhal To the officials concerned.

The internal audit committee meeting took place at Sri Padmavathi Rest House in Tirupati on Thursday. The EO reviewed on audit related issues with respect to various departments. JEOs Sri KS Sreenivasa Raju, Sri P Bhaskar, CVSO Sri Racikrishna, Auditors Sri Narasimhamurthy, Sri Sarat were also present.

The EO instructed the Annaprasadam wing to minimise the wastage of food while serving at Annaprasadam Complex, VQC I and II, SPRH etc. “The department has to notify the preparation, distribution and wastage list every day and maintain proper record. The Potu wing should keep ready fire extinguishers to face any emergency. The groceries and materials from Ugranam should be thoroughly observed and CC dam eras should be installed at Ugranam”, he directed the concerned.

Adding further he said, “In all Kalyana Kattas, the staff should be shown a documentary on Do’s and Don’ts and bring awareness among them”, he maintained.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
అన్నప్రసాదాల వృథాను అరికట్టాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

సెప్టెంబర్‌ 07, తిరుపతి, 2017 : తిరుమలలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు వృథాకాకుండా తగిన చర్యలు చేపట్టాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో గురువారం అంతర్గత ఆడిట్‌ కమిటీ సమావేశం జరిగింది.

ఈవో ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ, ప్రముఖ ఆడిటర్లు శ్రీనరసింహమూర్తి, శ్రీ శరత్‌, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, సిఏవో శ్రీ రవిప్రసాదు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలోని వెంగమాంబ అన్నప్రసాద భవనం, పద్మావతి అతిథిగృహం, వైకుంఠం క్యూకాంప్లెక్సు-1, 2లలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు వృథా కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏరోజుకారోజు అన్నప్రసాదాల తయారీ, వితరణ, వృథా తదితర అంశాలను నమోదు చేయాలని ఆదేశించారు. శ్రీవారి ఆలయం, అన్నప్రసాద విభాగం, పోటు తదితర ప్రాంతాల్లో అగ్నిమాపక పరికరాలు సమకూర్చాలన్నారు. ఉగ్రాణం నుంచి ఆలయంలోకి వెళ్లే సరుకులను నిత్యం పరిశీలించాలని, అక్కడ సిసి కెమెరాలు ఏర్పాటుచేయాలని సూచించారు. వసతి విభాగంలో నిర్వహణ మెరుగుపర్చాలన్నారు. ఇటీవల కొనుగోలు చేసిన గోనె సంచుల నాణ్యతను పరిశీలించాలని ఆదేశించారు. ప్రధాన కల్యాణకట్ట, మినీ కల్యాణకట్టల్లో క్షురకులకు అవగాహన కల్పించడానికి చేయవలసిన, చేయకూడని పనులతో కూడిన లఘు చిత్రాన్ని రూపొందించాలన్నారు.

టిటిడి ఆధీనంలోని ఆస్తుల వివరాలను కంప్యూటరీకరించాలని ఈవో ఆదేశించారు. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ నిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను మరింత బలోపేతం చేయాలన్నారు. మార్కెటింగ్‌ గోడౌన్ల వద్ద ప్రస్తుతం 20 టన్నుల వరకు ఉన్న వాహనాలను తూచే వే బ్రిడ్జి ఉందని, ఇంతకంటే ఎక్కువ బరువు గల వాహనాలు వచ్చినా తూచేందుకు వీలుగా నూతన వేబ్రిడ్జిని ఏర్పాటుచేయాలని సూచించారు. విద్యుత్‌ కొనుగోలు, వినియోగం, నిల్వపై ఆడిట్‌ చేయాలన్నారు. కల్యాణమండపాలను సక్రమంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.