“THE POPULARITY OF LORD OF SEVEN HILLS-VARDHATAM ABHIVARDHATAM”-TRIDANDI CHINNA JIYAR SWAMY_ శ్రీవేంకటేశ్వరస్వామివారి కీర్తి వర్ధతాం.. అభివర్ధతాం… : శ్రీవారిని దర్శించుకున్న శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి

Tirumala, 7 September 2017: HH Tridandi Sri Chinna Jiyar Swamy expressed that the popularity of Lord Venkateswara, the God of Kaliyuga is “Vardhatam-Abhivardhatam”-ever growing and endless.

The pontiff had darshan of Lord Venkateswara in Tirumala on Thursday. Tirumala JEO Sri KS Sreenivasa Raju along with his Tirupati counterpart Sri P Bhaskar welcomed the seer on his arrival at Mahadwaram and made darshan arrangements.

After darshan, speaking on this occasion, the Pontiff said, “I am overwhelmed by the “Netra Darshan” of Lord today. My purpose of visit is to seek His divine blessings for the massive spiritual activity which is coming up next year in Hyderabad, the installation of 216 feet mammoth Panchaloha statue of Bhagavat Ramanujacharya, the second tallest statue in the world in sitting posture on the occasion of the Sahasrabdi Utsavam of the great saint”, he added.

Adding further the seer said, Sri Ramanujacharya brought reformations in all Srivaishnava Divya Desams and pioneered many kainkaryams. “Amongh them, four kshetras, Sri Rangam, Tirumala, Melkote and Kanchipuram are important ones. It is Sri Ramanujacharya who taught the “Samanatva” – equality some 1000 years ago preaching that every one is Equal before Lord. Tirumala has become one of the world famous pilgrimage centres and has been continuing the legacy even today”, he maintained.

HH Tirumala Pedda Jiyangar Swamy, HH Tirumala Chinna Jiyar Swamy, temple DyEO Sri Kodanda Rama Rao, VGO Smt Sada Lakshmi were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రీవేంకటేశ్వరస్వామివారి కీర్తి వర్ధతాం.. అభివర్ధతాం… : శ్రీవారిని దర్శించుకున్న శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి

సెప్టెంబర్‌ 07, తిరుమల, 2017: కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారి కీర్తి వర్ధతాం.. అభివర్ధతాం అని, ప్రపంచవ్యాప్తంగా స్వామివారి కీర్తి వర్ధిల్లుతోందని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామి ఉద్ఘాటించారు. తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామివారు దర్శించుకున్నారు. టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి స్వాగతం పలికారు. తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ కలిసి గౌరవప్రదంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

దర్శనానంతరం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామివారు మాట్లాడుతూ భగవద్‌ రామానుజా చార్యులు వెయ్యేళ్ల క్రితమే సామాజిక సమానత్వాన్ని ప్రబోధించారని, వర్ణాలతో సంబంధం లేకుండా అందరికీ భగవంతుని సేవించుకునే అవకాశం ఉందని తెలియజేశారని వివరించారు. రామానుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకుని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో 216 అడుగుల భగవద్‌ రామానుజాచార్యుల పంచలోహ సమతామూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. కూర్చున్న భంగిమలోని విగ్రహాలలో ప్రపంచంలోనే ఇది రెండవ ఎత్తయినదిగా నిలవనుందని తెలిపారు. ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చానని చెప్పారు. రామానుజాచార్యులు తిరుమల, శ్రీరంగం, కాంచీపురం, మేల్కొటె క్షేత్రాలను అభివృద్ధి చేశారని వివరించారు. తిరుమలలో శ్రీవారి నేత్రదర్శనం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.