GT ASTHANAM HELD _ అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆస్థానం

Tirupati, 08 April 2024: On the last day of the five-day 521st Annamacharya Vardhanti fete, Sri Govindaraja Swamy Astanam was held in Annamacharya Kalamandiram on Monday.

The Project Director Dr Vibhishana Sharma speaking on the occasion said, Deity to the doorstep of His Devotee has become true with the Lord Himself appearing at Annamacharya Kalamandiram. Such was the great Bhakti of Annamacharya towards Sri Venkateswara. 

The project artists rendered a few Sankeertans penned by the Saint Poet on the occasion in a melodious manner. Earlier the procession of utsava deities took place. After Astanam, the deities returned to the temple.

DyEO of Sri Govindaraja Swamy temple Smt Shanti and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆస్థానం

తిరుపతి, 2024 ఏప్రిల్ 08: శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచార్యుల 521వ వర్ధంతి మహోత్సవాల్లో చివరి రోజైన సోమ‌వారం తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆస్థానం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్‌ ఆకెళ్ల విభీషణ శర్మ ప్రసంగిస్తూ, భక్తుడి చెంతకు భగవంతుడు రావడం అనే ఆర్యోక్తికి తార్కాణంగా శ్రీ వేంకటేశ్వరస్వామికి పరమభక్తుడైన అన్నమాచార్యుడు వెలసిన అన్నమాచార్య కళామందిరానికి శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవర్లు వేంచేయడం సంప్రదాయంగా కొనసాగుతోందన్నారు. అనంతరం గోవిందరాజస్వామివారిపై అన్నమయ్య రచించిన సంకీర్తనలను ప్రాజెక్టు కళాకారులు సుమధురంగా ఆలపించారు.

అంతకుముందు ఉదయం 7 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను ఆలయం నుండి ఊరేగింపుగా నాలుగు కాళ్ల మండపం, తీర్థకట్టవీధి మీదుగా అన్నమాచార్య కళామందిరానికి తీసుకొచ్చారు. ఆస్థానం అనంతరం తిరిగి ఉదయం 10 గంటలకు ఉత్సవమూర్తులను గోవిందరాజస్వామివారి ఆలయానికి తీసుకెళ్లారు.

ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో శ్రీ మ‌తి శాంతి, ఇత‌ర‌ అధికారులు, క‌ళాకారులు, పుర‌ప్ర‌జ‌లు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయడమైనది