ANNAMAIAH SANKEERTANS AIMS AT SPIRITUAL INTEGRITY _ ఆధ్యాత్మిక సమైక్యత కోసం అన్నమయ్య కీర్తనలు : ఆచార్య స‌ర్వోత్త‌మ‌రావు

Tirupati, 08 April 2024: Telugu Padakavita Pitamaha Sri Tallapaka Annamacharya Sankeertans were aimed at creating spiritual integrity in those days among the public, said scholars.

On the last day of the five-day literary meet held at Annamacharya Kalamandiram in Tirupati on Monday, Prof. Sarvottama Rao spoke on Annamaiah Prabhodamu, VC of Sri Potti Sriramulu Telugu University from Hyderabad Prof. Bhumaiah delivered a lecture on Annamaiah-Spirituality while Sri JD Naidu given a lecture on Annamaiah Alimelumanga Satakam, in the evening Sri Raghunath team and Smt Visalakshi rendered Sankeertans.

Project Director Dr Vibhishana Sharma was also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆధ్యాత్మిక సమైక్యత కోసం అన్నమయ్య కీర్తనలు : ఆచార్య స‌ర్వోత్త‌మ‌రావు

తిరుపతి, 2024 ఏప్రిల్ 08: ఆనాటి రాజకీయ కాలమాన పరిస్థితుల కారణంగా ప్రజల్లో అడుగంటిన భక్తిభావాన్ని చైతన్య పరిచి ఆధ్యాత్మిక సమైక్యత సాధించేందుకు శ్రీవేంకటేశ్వరస్వామివారిని కేంద్రంగా చేసుకుని అన్నమయ్య సంకీర్తనలు రచించి వ్యాప్తి చేశారని ఎస్వీ యూనివ‌ర్శిటి విశ్రాంత ఆచార్యులు స‌ర్వోత్త‌మ‌రావు పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 521వ వర్ధంతి ఉత్సవాలు తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో సోమ‌వారం ఘ‌నంగా ముగిశాయి.

ఈ సందర్భంగా జ‌రిగిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య స‌ర్వోత్త‌మ‌రావు ”అన్నమయ్య – ప్ర‌భోద‌ము ” అనే అంశంపై ఉపన్యసించారు

శ్రీ వేంకటేశ్వరుని నామంతో విశేషాలు, ఉత్స‌వాలతో భక్తజనానికి వీనులవిందుగా అన్నమయ్య కీర్త‌న‌లు ర‌చించిన‌ట్లు తెలిపారు. స్వామివారి రూపాన్ని కళ్లకు కట్టేలా అన్నమయ్య సాహిత్యం ఉంటుందన్నారు. అన్నమయ్య సంకీర్తనల్లో సాహిత్యంతో పాటు సంగీతానికి విశేష ప్రాధాన్యం ఉంటుందని వివరించారు.

హైద‌రాబాద్ శ్రీ పొట్టి శ్రీ‌రాములు తెలుగు విశ్వ‌విద్యాల‌యం విసి ఆచార్య భూమ‌య్య‌ ”అన్నమయ్య – ఆధ్యాత్మికత‌ ” అనే అంశంపై ఉపన్యసించారు యావత్‌ భక్తి సాహిత్యంలో అన్నమయ్యకు ప్రత్యేకమైన స్థానం ఉందని, వారి సంకీర్తనల్లో నవవిధ భక్తి మార్గాలను తెలియజేశారన్నారు. ఈ కీర్తనల్లో వేదాలు, రామాయణ, మహాభారతాలు, ఉపనిషత్తులు, పురాణాల్లోని అంశాలను అన్నమయ్య స్పృశించారని తెలిపారు. అన్నమయ్య బ్రహ్మ స్వరూపమని, ఆయన అనుసరించింది బ్రహ్మమార్గమని తెలియజేశారు. శ్రీవారిపై భక్తి ద్వారా అన్నమయ్య సంపూర్ణ మానవజీవనాన్ని చవిచూశారని తెలిపారు.

తిరుపతి చెందిన శ్రీ జిడి నాయుడు “అన్నమయ్య – అలమేలుమంగ శ‌త‌కం” అనే అంశంపై ఉపన్యసించారు , అన్నమయ్య తన సంకీర్తనల్లో శృంగార, భక్తి, కవితా విశేషాలను గురించి వివరించారు.

సాయంత్రం 6 గంటలకు తిరుప‌తికి చెందిన శ్రీ ర‌ఘునాథ్‌ బృందం, రాత్రి 7 గంటలకు తిరుపతికి చెందిన శ్రీమ‌తి విశాలాక్షి బృందం సంగీత సభ నిర్వ‌హించ‌నున్నారు.

ఈ కార్యక్రమంలో అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణ శర్మ, ఇతర అధికారులు, క‌ళాకారులు, విశేష సంఖ్య‌లో పుర ప్ర‌జ‌లు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.