AYODHYAKANDA AKHANDA PARAYANAM HELD _ భక్తిసాగరంలో ముంచెత్తిన అయోధ్యకాండ అఖండ పారాయ‌ణం

TIRUMALA, 06 APRIL 2024: The Ninth edition of Ayodhya Kanda Akhanda Parayanam was held on the Nada Neerajanam platform at Tirumala on Saturday with utmost religious fervour.

As a part of it 172 shlokas from Chapters 31-34 besides 25 shlokas from Yogavasistyam and Dhanwantari Maha Mantram were recited under the supervision of Vedic scholars Dr Ramanujacharyulu, Sri Ananta, Dr Maruti trio.

At the beginning of the Parayanam, the artists presented Ramabhadra Rara.. Kriti and at the conclusion sang Rama Raghurama… In a melodious manner.

Vedic scholars, Vedic students, and devotees participated in this event while millions across the globe participated virtually experiencing the devotional vibes seeing the live telecast on SVBC.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

భక్తిసాగరంలో ముంచెత్తిన అయోధ్యకాండ అఖండ పారాయ‌ణం

తిరుపతి, 2024 ఏప్రిల్ 06: లోక క‌ల్యాణార్థం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై శ‌నివారం ఉదయం జరిగిన 9వ విడ‌త అయోధ్య‌కాండ అఖండ పారాయణం భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తింది. ఉదయం 6 నుండి 7.30 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది.

అయోధ్యకాండలోని 31 నుండి 34వ‌ సర్గ వ‌ర‌కు మొత్తం నాలుగు స‌ర్గ‌ల్లో 172 శ్లోకాలు, యోగ‌వాశిష్టం మ‌రియు ధ‌న్వంత‌రి మ‌హామంత్రంలోని 25 శ్లోకాలు క‌లిపి మొత్తం 197 శ్లోకాల‌ను పారాయణం చేశారు.

ధర్మగిరి వేద పాఠశాల పండితులు డా. కె.రామానుజాచార్యులు, శ్రీ అనంత, డా.మారుతి శ్లోక పారాయ‌ణం చేశారు. అఖండ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేదాధ్యయ‌న సంస్థకు చెందిన వేదపారాయ‌ణదారులు, జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యానికి చెందిన శాస్త్ర పండితులు పాల్గొన్నా‌రు.

ఈ సందర్భంగా ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ‌మ‌తి వంద‌న‌ బృందం “రామ భ‌ద్ర రారా….రామ‌చంద్ర రారా…. ” అనే కీర్తనను కార్యక్రమ ప్రారంభంలో, “రామ రామ ర‌ఘురామ‌……” అనే సంకీర్తనను చివరిలో రసరమ్యంగా ఆలపించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ అధికారులు, పండితులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.