AUCTION OF TTD VASTRAM ON AUGUST16-19 _ ఆగష్టు 16 నుండి 19వ‌ తేదీ వరకు టీటీడీలో వ‌స్త్రాల ఈ – వేలం

Tirupati, 31 July 2023: TTD is organising the e-auction of  194 lots of new /used/ partially damaged clothes donated to Srivari temple and other TTD temples from August 16-19.

They include polyester, cotton dhotis, cloth bits, Pavitras, blouse pieces, uttarium, turkey towels, lungis, shawls, bed sheets, pillow covers, Punjabi dress materials, jamkhanas, carpet, blankets, curtains of Bangaru vakili, khaki curtains etc.

For more details, contact the TTD marketing office on 0877-2264429 or log into the TTD website ‌ at www.tirumala.org / www.konugolu.ap.gov.in  

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగష్టు 16 నుండి 19వ‌ తేదీ వరకు టీటీడీలో వ‌స్త్రాల ఈ – వేలం

తిరుపతి, 2023 జూలై 31: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఆగష్టు 16 నుండి 19వ‌ తేదీ వరకు ఈ – వేలం వేయనున్నారు. కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 194 లాట్లు ఉన్నాయి. ఇందులో పాలిస్ట‌ర్, కాట‌న్‌ పంచ‌లు, క్లాత్ బిట్స్‌, హుండీ గ‌ల్లేబులు, ప‌విత్రాలు, బ్లౌజ్‌పీస్‌లు, ఉత్త‌రీయాలు, ట‌ర్కీ ట‌వ‌ళ్లు, లుంగీలు, శాలువ‌లు, బెడ్‌షీట్లు, దిండుక‌వ‌ర్లు, పంజాబి డ్రెస్ మెటీరియ‌ల్స్‌, జంకాళం కార్పెట్లు, దుప్ప‌ట్లు, క‌ర్ట‌న్లు, గ‌ర్భ‌గృహ కురాళాలు, బంగారువాకిలి ప‌ర‌దాలు, కాకి ప‌ర‌దాలు ఉన్నాయి.

ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org / www.konugolu.ap.govt.in సంప్రదించగలరు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.