CLOSURE OF SRIVARI PUSHKARINI FROM AUGUST 1-31 _ ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు శ్రీవారి పుష్క‌రిణి మూత

SHOWERS ARRANGED

Tirumala, 31 July 2023: As a practice, in order to undertake cleaning works and civil repairs of Swamy Pushkarini in connection with ensuing brahmotsavams scheduled in September and October this year, the Srivari Pushkarini will remain closed from August 1-31 for cleansing purpose.

TTD has also subsequently cancelled Pushkarini Harati till the completion of these works.

As an alternative, TTD has arranged showers to for the devotees to take holy bath instead of Pushkarini Snanam during this period.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు శ్రీవారి పుష్క‌రిణి మూత

– భక్తులకు షవర్ల ద్వారా పుణ్యస్నానాలు చేసే ఏర్పాటు

తిరుమల, 2023, జూలై 31: తిరుమ‌లలో శ్రీ‌వారి ఆల‌యం వద్ద గల పుష్క‌రిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు గాను ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు పుష్క‌రిణిని మూసివేస్తారు. ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్క‌రిణి హార‌తి ఉండ‌దు.

పుష్క‌రిణి మ‌ర‌మ్మ‌తుల కోసం మొద‌టి ప‌ది రోజుల పాటు నీటిని తొల‌గిస్తారు. ఆ త‌రువాత ప‌ది రోజులు మ‌ర‌మ్మ‌తులు ఏవైనా ఉంటే పూర్తి చేస్తారు. చివ‌రి ప‌ది రోజులు పుష్క‌రిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు. పుష్క‌రిణిలోని నీటి పిహెచ్ విలువ 7 ఉండేలా చూస్తారు. టీటీడీ వాట‌ర్ వ‌ర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు చేపడతారు.

శ్రీవారి భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు వీలుగా పుష్కరిణి పైభాగంలో టీటీడీ షవర్లు ఏర్పాటు చేసింది. భక్తులు వీటిని వినియోగించుకోవాలని కోరుతోంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.