ఆగష్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా శ్రావ‌ణ పౌర్ణ‌మి ఉత్స‌వాలు                         

ఆగష్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా శ్రావ‌ణ పౌర్ణ‌మి ఉత్స‌వాలు                        

తిరుపతి, 2010 ఆగష్టు 23 : రాష్ట్రవ్యాప్తంగా తితిదేచే శ్రావణపూర్ణిమ మహోత్సవాలు తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శ్రావణపూర్ణిమ మహోత్సవాలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ నెల 24వ తేదిన వైభవంగా నిర్వహించనున్నది.  రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలతోపాటు చెన్నై, బెంగుళూరులలో కూడా ఈ ఉత్సవాలను తితిదే నిర్వహిస్తోంది.
సంవత్సరములో వచ్చే 12 పౌర్ణములలో వైశాఖ

పౌర్ణమి, ఆషాడ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, కార్తీక పౌర్ణమిలకు ప్రత్యేక స్థానం వుంది. దీనిలో శ్రావణ పౌర్ణమినాడు శ్ర‌వణా నక్షత్రం వున్నందున, శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆవిర్భావ నక్షత్రం శ్రవణం కావడం మూలాన శ్రావణ పూర్ణిమను తితిదే సశాస్త్రీయంగా నిర్వహించనున్నది.

ఈ ఉత్సవాలలో భాగంగా భక్తులందరికి కుంకుమ, పుస్తక ప్రసాదాలతోపాటు శ్రీనివాసుని పాదాలచెంత వుంచిన రక్షాకంకణాలు ఉచితంగా ఇస్తారు. ప్రతి జిల్లా కేంద్రాలలో ఈ ఉత్సవాలలో భాగంగా శ్రీవారి కళ్యాణాన్ని కూడా నిర్వహిస్తారు.

తిరుపతిలో ప్రత్యేక ఉత్సవాలు:

తిరుపతిలో దేవస్థానం పరిపాలనా భవనం వెనుక వున్న ప్రాంగణంలో ఈ ఉత్సవాలు మంగళవారం ఉదయం 10 గంటల నుండి వైభవంగా ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవాలలో కుర్తాళం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతిస్వామి వారి అనుగ్రహ భాషణం వుంటుంది. భక్తులందరికి ప్రత్యేకించి కుంకుమ‌, పుస్తకాలు, రక్షాకంకణ ప్రసాదాలు అందజేయబడతాయి.

స్వామిజీవారి అనుగ్రహభాషణం అనంతరం శ్రీపద్మావతి శ్రీనివాసుల కళ్యాణం కమనీయంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో ప్రజలందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహంను పొందవలసినదిగా తితిదే కోరుచున్నది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.