PAVITROTSAVAM AT SRIVARI TEMPLE FROM AUG 18-20 _ ఆగ‌స్టు 18 నుంచి 20వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

Tirumala, 16 August 2021: TTD is organizing the annual Pavitrotsavsm mahotsavam at Srivari temple in ekantham from August 18-20 with Ankurarpanam on August 17 in view of COVID-19 guidelines.

 

Puranic legends show that the unique mahotsavam was conducted in all vaishnavite temples since the 15th century and revived by TTD in 1962 to ward off the bad impact of any lapses during yearlong rituals and utsavas by either devotees or archakas.

 

As part of the festivities, snapana thirumanjanam is performed daily to utsava idols of Sri Malayappa Swamy and his consorts. Thereafter in the evening, the well-bejewelled utsava idols of Swami and consorts are taken out in procession on the Mada streets.

 

As part of the festivities, the Pavitra pratista is observed on August 18, Pavitra Samarpana on August 19 and Purnahuti is performed on August 20.

 

In view of the Pavitrotsavam celebrations at Srivari Temple, the TTD has cancelled all virtual arjita sevas of Kalyanotsavam, Unjal Seva, arjita brahmotsavam and Sahara Dipalankara Sevas from August 17- 20.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఆగ‌స్టు 18 నుంచి 20వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుమల, 2021 ఆగస్టు 16: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగ‌స్టు 18 నుంచి 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఆగ‌స్టు 17న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. కోవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ ఉత్స‌వాలను జ‌రుపుతారు.

పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.

ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వ‌హిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. ఆగ‌స్టు 18న పవిత్రాల ప్రతిష్ట, ఆగ‌స్టు 19న పవిత్ర సమర్పణ, ఆగస్టు 20న పూర్ణాహుతి కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తారు.

ఆర్జితసేవలు రద్దు

ప‌విత్రోత్స‌వాల్లో ఆగ‌స్టు 17న అంకురార్ప‌ణ కార‌ణంగా సహస్రదీపాలంకార సేవను టిటిడి ర‌ద్ధు చేసింది. అదేవిధంగా, ఆగ‌స్టు 18 నుండి 20వ తేదీ వ‌ర‌కు వ‌ర్చువ‌ల్ సేవ‌లైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ర‌ద్ద‌య్యాయి.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.