JEO (H&E) LAUDS AYUR STUDENT _ ఎస్వీ ఆయుర్వేద వైద్య విద్యార్థికి జేఈవో అభినందన

TIRUPATI, 28 AUGUST 2023: TTD JEO for Health and Education Smt Sada Bhargavi on Monday congratulated Sri N Bharadwaja for his expertise in research in Ayurveda.

The Central Council for Research in Ayurvedic Sciences (CCRAS), New Delhi haa given encouragement to 100 students to do research in Ayurveda and started a project in 2022. Sri Bharadwaja was one among the students who won a prize money of Rs.50 thousands and a certificate of appreciation for his research paper on “A clinical study to evaluate the efficiency of Vasadi Kwatha and Eranda Beeja Lepa along with Ksheera Seka in the management of Vata Rakta” under the guidance of Prof. Gnana Prasoona, Head of Department of Kaya Chikitsa in SV Ayurvedic College.

Principal Dr Muralikrisha, Vice Principal Dr Sundaram were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ ఆయుర్వేద వైద్య విద్యార్థికి జేఈవో అభినందన

తిరుపతి, 2023, ఆగస్టు 28: ఆయుర్వేద పరిశోధనలో ప్రతిభ కనబరిచిన ఎస్వీ ఆయుర్వేద వైద్య కళాశాల విద్యార్థి ఎన్.శ్రీకర్ భరద్వాజను టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి సోమవారం తమ కార్యాలయంలో అభినందించారు.

ఆయుర్వేద వైద్య‌శాస్త్రంలో భార‌త‌దేశంలోనే ఉన్న‌త ప‌రిశోధ‌నా సంస్థ అయిన న్యూఢిల్లీలోని సిసిఆర్ఎఎస్‌(సెంట్ర‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ రీసెర్చి ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్‌) సంస్థ ఆయుర్వేద వైద్య విద్యార్థుల్లో ప‌రిశోధ‌న‌పై అవ‌గాహ‌న పెంచి ప్రోత్స‌హించ‌డానికి స్పార్క్‌(స్టూడెంట్‌షిప్ ప్రోగ్రామ్ ఫ‌ర్ ఆయుర్వేద రీసెర్చి కెన్‌) అనే ప‌రిశోధ‌న ప్రాజెక్టును 2022వ సంవత్సరంలో ప్రారంభించింది. దేశం మొత్తంలో 100 మంది విద్యార్థుల‌ను వారి ప‌రిశోధ‌న ప్రాజెక్టుల ఆధారంగా గుర్తించి ప్రోత్స‌హించింది. ఇందులో ఎస్వీ ఆయుర్వేద క‌ళాశాల విద్యార్థి శ్రీ‌క‌ర్ భ‌ర‌ద్వాజ చోటు దక్కించుకున్నారు. ఈ విద్యార్థి “వాత‌రక్తం అనే వ్యాధిలో వాసాదిక్వాధం ఏరండ బీజ లేప‌ము, క్షీర‌సేకం అనే ఆయుర్వేద ప్ర‌క్రియ‌ల ప్ర‌యోజ‌నం” అనే అంశంపై కాయ చికిత్స ప్రొఫెస‌ర్ డాక్టర్ జ్ఞాన‌ప్ర‌సూన‌ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చేసిన ఆయుర్వేద ప‌రిశోధ‌న‌కు ఉత్త‌మ ప‌రిశోధ‌న‌గా గుర్తింపు ల‌భించింది. ఇందుకు గాను సిసిఆర్ఎఎస్‌ సంస్థ రూ.50 వేలు న‌గదు బ‌హుమ‌తి, ప్రశంసాపత్రం అంద‌జేసింది.

ఈ కార్య‌క్ర‌మంలో క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ ముర‌ళీకృష్ణ‌, వైస్ ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ సుంద‌రం, ప్రొఫెస‌ర్ జ్ఞాన‌ప్ర‌సూన పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.