OATH TAKEN _ టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ దేశ్ పాండే ప్రమాణ స్వీకారం

TIRUMALA, 28 AUGUST 2023: Sri Raghunath Viswanath Deshpande from Karnataka took oath as member of the TTD Trust Board on Monday in front of Sri Venkateswara Swamy in Tirumala.

The oath was administered by Tirupati JEO Sri Veerabrahmam.

After darshan, the new TTD Trust Board member was offered Vedasirvachanam followed by a presentation Theertha Prasadams, laminated photo of Srivaru by JEO at Ranganayakula Mandapam.

Deputy EOs Sri Lokanatham, Sri Govindarajan, Peishkar Sri Srihari, OSD Sri Ramakrishna and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ దేశ్ పాండే ప్రమాణ స్వీకారం

తిరుమల, 2023 ఆగస్టు 28: టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన శ్రీ రఘునాథ్ విశ్వనాథ్ దేశ్ పాండే సోమవారం శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.

శ్రీవారి ఆలయంలో స్వామివారి సన్నిధిలో టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని జేఈవో అందజేశారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ గోవిందరాజన్, ఓఎస్డీ శ్రీ రామకృష్ణ, పేష్కార్ శ్రీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.